మెగాస్టార్ చిరంజీవి మెగా యాక్షన్ ఎంటర్‌టైనర్ భోళా శంకర్. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర భారీ కాన్వాస్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ తో పాటు భోళా మానియా, జామ్ జామ్ జజ్జనక పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం థర్డ్ సింగిల్ మిల్కీ బ్యూటీ పాటని సెన్సేషనల్ కంపోజర్ తమన్ లాంచ్ చేశారు.