మెగాస్టార్‌ చిరంజీవి పునాది వేస్తె, ఎం.పి. వల్లభనేని బాలశౌరి పూర్తిచేస్తున్నారు

శనివారం, 15 జులై 2023 (11:01 IST)
Chiranjeevi, Vallabhaneni Balashauri
కమిట్‌మెంట్‌ ఉన్న ఇద్దరు పెద్ద మనుషులు చేసే మంచిపనుల వల్ల పదిమందికి ఉపయోగం ఉంటే ఆ పని జాతికి గర్వకారణం అంటారు. మెగాస్టార్‌ చిరంజీవి యం.పిగా ఉన్నప్పుడు 2012–14ల మధ్యకాలంలో గుంటూరు జిల్లా తెనాలి పక్కన ఉన్న కొల్లిపర మండలంలోని చక్రాయపాలెం గ్రామంలో చక్రాయపాలెం కమ్యూనిటి హాలును నిర్మించటానికి 25లక్షల రూపాయల యం.పి నిధులను కేటాయించారు. ఆ నిధులు సరిపోక కమ్యూనిటి హాలు నిర్మాణం ఆగిపోయింది. 
 
చక్రాయపాలెం గ్రామాన్ని తన సొంత గ్రామంగా భావించే మచిలీపట్నం యం.పి వల్లభనేని బాలశౌరి ఆగిపోయిన  కమ్యూనిటీ హాలు నిర్మాణం పూర్తి అవ్వటానికి  కావాల్సిన 40లక్షల రూపాయల నిధులను అందించి నాలుగు నెలల్లో నిర్మాణాన్ని పూర్తిచేస్తాను అంటూ ముందుకొచ్చారు. ఆ కమ్యూనిటీ హాలుకు మెగాస్టార్‌ చిరంజీవి హాలుగా నామకరణం చేస్తాం అని  సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్టర్‌లో తెలియచేశారు. చరిత్రలో నిలిచిపోయేలా వారిద్దరి పెద్దమనసులను పలువురు ట్వీటుల ద్యారా ప్రశంసిస్తూన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు