తమన్నా పెళ్లి గురించి దుమారం... అసలు ఆమె ఏం చెప్పింది?

బుధవారం, 7 ఆగస్టు 2019 (20:33 IST)
నిప్పు లేనిదో పొగ రాదంటారు. కానీ నిప్పు లేకపోయినా పొగలాంటి వార్తలు వ్యాపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువైంది. 'బాహుబలి అవంతిక' తమన్నా పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఐతే ఆమె తన పెళ్లికి సంబంధించిన ప్రశ్నను అడిగినప్పుడు తన తల్లిదండ్రులు ఆ విషయాన్ని చూసుకుంటారని చెప్పింది. 
 
ఇది అందరూ చెప్పేదే. కానీ ఇలా చెప్పడంతోనే ఇక తమన్నా పెళ్లికి ఫిక్సయి పోయిందంటూ ప్రచారం జరుగుతోంది. మళ్లీ తమన్నానే.... నేనిప్పుడే పెళ్లి చేసుకోవట్లేదు బాబోయ్ అనేవరకూ ఈ వార్త అలా హల్చల్ చేస్తూనే వుంటుంది.
 
ఇకపోతే తమన్నా ప్రస్తుతం కొన్ని టాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు స్క్రిప్టులు వింటోందట. ఐతే బాలీవుడ్ చిత్రంలో ప్రత్యేకించి హృతిక్ రోషన్ పక్కన నటించే అవకాశం వస్తుందేమోనని ప్రయత్నాలు చేస్తోందట. ఒకవేళ వస్తే ఆయన పక్కనే నటించడమే కాదు... లిప్ టు లిప్ కిస్ కూడా ఇచ్చేస్తానని అంటోందట ఈ మిల్కీ బ్యూటీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు