చిరంజీవి 150వ సినిమాలో చిరుతో స్టెప్పులేయనున్న తెల్లపిల్ల తమన్నా.. ఐటమ్ గర్ల్‌గా?

సోమవారం, 29 ఆగస్టు 2016 (17:02 IST)
చిరంజీవి 150వ సినిమా టైటిల్ ఖరారైంది. హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ కూడా కన్ఫామ్ అయిపోయింది. ఇక ఐటమ్ గర్ల్ కోసం సెర్చింగ్ జరుగుతోంది. ఇందుకు తెల్లపిల్ల తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. హీరోయిన్ల కోసం అనుష్క, నయనతారలతోపాటు తమన్నాను కూడా అప్పట్లో చిరు అండ్ టీమ్ సంప్రదించింది. అయితే కాల్‌షీట్ల ప్రాబ్లమ్‌ వల్ల తమన్నా అప్పడు డ్రాప్‌ అయింది. 
 
అయితే ఎట్టకేలకు ఆ సినిమాలో కనిపించేందుకు అంగీకరించిందట తమన్నా. అయితే హీరోయిన్‌గా కాదు ఐటమ్ గర్ల్‌గా. అల్లుడు శీను వంటి సినిమాల్లో ఐటమ్ గర్ల్ మంచి మార్కులు కొట్టేసిన తమన్నా.. తాజాగా గోపిచంద్ సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్‌లో డ్యాన్స్ వేసేందుకు సై అంది. ఇదే తరహాలో చిరంజీవి 150వ సినిమాలోనూ తమన్నా ఐటమ్ సాంగ్‌కు స్టెప్పులేయనున్నట్లు తెలిసింది. 
 
ఇంకా చెప్పాలంటే.. మెగా ఫ్యామిలీకి తమన్నా చాలా క్లోజ్‌. పవన్‌, బన్నీ, చరణ్‌ వంటి హీరోలందరితోనూ తమన్నా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు చిరుతో కూడా స్ర్కీన్‌ షేర్‌ చేసుకోబోతుండటం ద్వారా అమ్మడు హ్యాపీగా ఫీలవుతోంది. 

వెబ్దునియా పై చదవండి