ఇటీవల ఈడీ తమన్నాకు సమన్లు జారీ చేయగా, గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు గౌహతిలోని ఈడీ కార్యాలయానికి ఆమె చేరుకున్నారు. ఈ సమయంలో ఆమె తల్లి కూడా ఆమెతో వచ్చారు. దాదాపు ఐదు గంటల పాటు ఈడీ తమన్నా వద్ద విచారణ జరిపింది.
ఈ సందర్భంలో తమన్నా భాటియాను నిందితురాలిగా విచారించడం లేదు. కానీ హెచ్‌పీజెడ్ టోకెన్ యాప్‌కు ప్రచారం చేసినందుకు ఆమె వద్ద విచారిస్తున్నారు. ఈ యాప్ ద్వారా ప్రజలు రూ. 57,000 పెట్టుబడి పెడితే రోజుకు రూ.4,000 ఇస్తామని హామీ ఇచ్చారు. దీని ద్వారా కోట్లాది మంది డబ్బులు పెట్టి మోసపోయారు. ఈ విషయం కూడా మహాదేవ్ యాప్ స్కామ్‌తో ముడిపడి ఉంది. ప్రజలు దీని ద్వారా డబ్బు సంపాదించి మహాదేవ్ బెట్టింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టేవారు.
ఈ కేసులో ఇప్పటి వరకు రూ. 497.20 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. ఇప్పటికే ఓసారి ఈడీ ముందు హాజరైన తమన్నాకు.. ఈ యాప్ ప్రమోషన్‌లో భాగంగా మళ్లీ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.