తెలుగు చిత్రపరిశ్రమలో దాదాపు 16 యేళ్లుగా కొనసాగుతున్న హీరోయిన్ తమన్నా. ఈ ముద్దుగుమ్మకు వయసు మీదపడుతున్నప్పటికీ.. అటు అందంతో పాటు సినీ అవకాశాలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో ఆమె తన స్థిర నివాసంగా ముంబైని ఎంచుకుంది. దీంతో ముంబై మహాగరంలో ఏకంగా రూ.15 కోట్ల వ్యయంతో సొంతింటిని నిర్మించుకుందట. ఈ విషయం తాజాగా వెల్లడైంది.
ఓ ప్రముఖ పెయింటింగ్ కంపెనీ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా తన ఇంటిని చూపించింది ఈ ముద్దుగుమ్మ. ముంబైలో చాలా అద్భుతంగా నిర్మించుకుంది. ఇందుకోసం సుమారుగా రూ.15 కోట్లకు పైగానే ఖర్చు చేసింది. ఇప్పుడు ఇంటి వీడియోను చూపించి అందర్నీ ఆకట్టుకుంది. తను లేకపోయినా తన తండ్రి అన్నీ దగ్గరుండి చూసుకుంటాడని.. ఇల్లు నిర్మాణం కూడా అన్నీ నాన్న చూసుకున్నాడని చెప్పుకొచ్చింది.
విశాలమైన స్థలంలో విలాసవంతంగా ఈ ఇంటిని నిర్మించారు. షూటింగ్స్ కారణంగా ఎక్కువగా తాను ఇంట్లో ఉండే అవకాశం లేకపోయినా కూడా నాన్నే పనులు కూడా పూర్తి చేశాడని వీడియోలో చెప్పుకొచ్చింది. షూటింగ్స్ కోసం ఎన్ని దేశాలు తిరిగినా కూడా ఒక్కసారి తన సొంతింట్లోకి వచ్చి పడుకుంటే ఆ వచ్చే అనుభూతి మరెక్కడా దొరకదని తెలిపింది.