నాగసాధు (శివశక్తి) పాత్రలో తమన్నా లుక్ అదుర్స్...

సెల్వి

బుధవారం, 9 అక్టోబరు 2024 (13:37 IST)
Tamannah
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా.. శివశక్తి (నాగ సాధు)గా కనిపించనున్నారు. ఆమె ముఖ్య పాత్రలో నటించిన చిత్రం "ఓదెల-2". ఇందులో ఆమె ఇప్పటివరకు పోషించని పాత్రను పోషించినట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో నాగసాధు పాత్రకు సంబంధించిన లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 
 
మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. 2021లో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీకి అశోక్ తేజ దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రం ముంచి విడుదలైన తమన్నా ఫస్ట్ లుక్‌‍కు మంచి స్పందన వచ్చింది. 
 
ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణలో భాగంగా, చివరి షెడ్యూల్ ఓదెల గ్రాంలో జరుగుతుంది. మహదేవుని ఆశీస్సులతో కాశీలో ప్రారంభమైన ఈ థ్రిలలింగ్ సీక్వెల్ ఇపుడు ఓదెల మల్లన్న క్షేత్రంలో చిత్రీకరణ జరుగుతుంది. 
 
టీమ్ ఐకానిక్ ఓదెల మల్లన్న ఆలయం గ్రామంలోని అందమైన ప్రదేశాలలో కీలక సన్నివేశాలను షూటింగ్ చేస్తున్నారు. తమన్నా, మురళీ శరమ, హెబ్బా పటేల్, యువ, ఇతర నటీనటులు చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు