ఈనేపథ్యంలో తన వ్యక్తిగత జీవితంపై స్పందిస్తూ, 'నాకు చిత్రపరిశ్రమలో స్నేహితులు చాలా తక్కువ. ప్రభాస్, రవితేజ వంటి కొంతమంది హీరోలతో స్నేహం ఉంది. ప్రభాస్ చాలా నమ్మకస్తుడు. అతనితో ఎలాంటి రహస్యాన్ని పంచుకున్నా ఫర్వాలేదు. ఇక, రవితేజది చిన్నపిల్లాడి మనస్తత్వం. ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటారని చెప్పుకొచ్చింది.
ఇకపోతే, తమిళ స్టార్ హీరో విక్రమ్ చాలా పెర్ఫెక్షనిస్టు. ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటారని తెలిపింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయనతో నటించే అవకాశం వస్తే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోబోనని చెప్పుకొచ్చింది.