కోలీవుడ్ హీరో 'చియాన్' విక్రమ్ కుమార్తె అక్షిత వివాహ నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగింది. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మునిమనవడు మను రంజిత్‌కి, అక్షిత సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ శుభకార్యం జరిగింది. ఈ శుభకార్యానికి పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అక్షిత, రంజిత్‌ల వివాహం 2017లో జరగనుంది.
ఇదిలా ఉంటే నిశ్చితార్థం ఉంగరం పోయినట్లు అక్షిత, విక్రమ్‌లు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంగళవారం ఖాదర్ నవాజ్ ఖాన్ రోడ్డులోని ఓ ఐస్‌క్రీం పార్లర్ వెళ్లి వస్తుండగా చేయి చూసుకునే సరికి చేతికి ఉంగరం లేదని.. దాని విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని అక్షిత ఫిర్యాదులో వెల్లడించారు. పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి ఐస్‌క్రీం పార్లర్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి విచారణ జరుపుతున్నారు.