సంక్రాంతి సంబరాల్లో భాగంగా, గుడివాడ ఎమ్మెల్యే, ఏపీ మంత్రి కొడాలి నానికి చెందిన కె-కన్వెన్షన్ సెంటరులో జరిగిన గోవా క్యాసినో వ్యవహారంపై సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. మంత్రి కొడాలి నానికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కొడాలి నాని... ఈ వ్యవహారంపై పారదర్శకంగా విచారణ జరిపిస్తామని చెప్పకుండా విపక్ష నేత చంద్రబాబుపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
అంతేకాకుండా, మంత్రి నాని బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారని, అభ్యంతరకర పదజాలం వాడడం సరికాదని, చాలా మంది నేతలు ఇంటర్వ్యూలలో దూషించే పదజాలం వాడుతున్నారని, ఆ అభ్యంతరకరమైన పదజాలం వాడటం మానుకోవాలని తమ్మారెడ్డి హితవు పలికారు.