మీకు చేతులెత్తి మొక్కుతున్నా.. అర్థం చేసుకోండ్రా.. ప్లీజ్.. తమ్మారెడ్డి

శనివారం, 30 మే 2020 (15:13 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివానలా మారాయి. బాలయ్య వ్యాఖ్యలను మెగా బ్రదర్ నాగబాబు ఖండించారు. వీరిద్దరి వివాదం ఇపుడు తారా స్థాయికి చేరింది. ఈ వ్యవహారంపై సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించారు. ఈ వివాదాన్ని ఇంతటితో అపెయ్యండ్రా.. ఇవి పెరిగి పెరిగి ఎక్కడికో దారితీసేలా ఉన్నాయ్ అంటూ మీడియా మిత్రులను కోరారు. అంతేకాకుండా మీకు చేతిలెత్తి మొక్కుతున్నా.. అర్థం చేసుకోండ్రా ప్లీజ్ అంటూ విజ్ఞప్తి చేశారు. 
 
ఇదే అంశంపై తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందిస్తూ, లాక్డౌన్ దెబ్బకు సినీ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీకి మేలు జరిగేలా చూడాలన్నదే ప్రతి ఒక్కరి కోరిక అని చెప్పారు. అంతేకాకుడా, బాలయ్య - నాగబాబుల వివాదాన్ని పెద్దది చేయొద్దని మీడియాను కోరారు.
 
కాగా, దర్శకరత్న దాసరి నారాయణ రావు వర్థంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి తమ్మారెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, పై విధంగా విజ్ఞప్తి చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు