తాజాగా ఈ సినిమా విడుదలైన 26 రోజుల్లో 26 కోట్ల రూపాయల షేర్‌ను వసూలు చేసింది. హీరోయిన్ ప్రాధాన్యత కలిగినా ఈ సినిమా వసూళ్లు బాగా రాబట్టింది. సావిత్రి జీవితంలోని విషాద సంఘటనలు, ఆమె మృతికి దారితీసిన పరిస్థితులను గురించి తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపడం ద్వారా ఈ సినిమా క్రేజ్ బాగా పెరిగింది.
ఇందులో జెమినీ గణేశన్ వల్లే సావిత్రి హీరోయిన్ అయినట్లు, అయన్ని చాలా మంచి వాడిగా చూపించారు. అలా చూపించకుండా ఉండి ఉంటే బాగుండేదని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే నాగ్ అశ్విన్ ఆలోచనలో అలాలేదు కాబట్టి ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది అది వేరే విషయమంటూ కామెంట్స్ చేశారు. మహానటి సావిత్రి బయోపిక్ కాదని కల్పిత కథని, చెప్పారు.
ఈ చిత్రంలో మహానటి మంచిదే.. జెమినీ గణేశన్ మంచోడు.. వాళ్ల పిల్లలూ మంచోళ్లే.. ఈ చిత్రాన్ని చూసి మీరు తిట్టుకోవద్దు. ఈ సినిమా చూసి ఓ మంచి అనుభూతి పొందా అని చూసి రండి, అంతే తప్ప గొడవలు పడొద్దు అంటూ జెమినీ గణేశన్ కూతుళ్లను, సావిత్రి కూతుళ్లనకు హితవు పలికారు తమ్మారెడ్డి.