ప్రధానంగా తన ఆలోచనలు, పవన్ ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయని చెప్పుకొచ్చిన తమ్మారెడ్డి.. తన మనసులో ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయో.. అలాంటి ప్రశ్నలనే పవన్ లేవనెత్తుతున్నారని చెప్పారు. ఇపుడు పవన్‌ను చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉందన్నారు.
ఒక నిజమైన లీడర్ ప్రజల ముందుకు వచ్చారనే సంతృప్తి ఉందన్నారు. అయితే, పవన్ ముందుగా ప్రకటించినట్టుగా 175 అసెంబ్లీ సీట్లకు అవసరమైన అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయంలో స్వర్గీయ ఎన్టీఆర్ అనుసరించిన విధానాన్ని పాటించాలని కోరారు. తమ్మారెడ్డి భరద్వాజ్ పోస్ట్ చేసిన వీడియోను మీరూ చూడండి.