"తంగలాన్" సినిమాను జనవరి 26న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇవాళ ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. "తంగలాన్" రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో చియాన్ విక్రమ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. విక్రమ్ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ లో తన నటనతో సర్ ప్రైజ్ చేయబోతున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. నవంబర్ 1వ తేదీన "తంగలాన్" సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించారు.
నటీనటులు - చియాన్ విక్రమ్, పార్వతీ, మాళవిక మోహనన్, పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై తదితరులు