Tanikella Bharani released the song
కళ్యాణ్, సోఫియా ఖాన్, ఊహ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ఎ స్టార్ హీరో ఈజ్ బార్న్. వి.జె.సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. సి.ఆర్.ప్రొడక్షన్, వి.జె.ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై రవిసాగర్, వి.జె.సాగర్ ఈ చిత్నాన్ని నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణి చేతుల మీదుగా ఓం నమః శివాయ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. తనికెళ్ల శంకర్ రాసిన ఈ పాటను చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తోన్న సునీల్ కశ్యప్ ఆలపించారు.