తార‌క్ కోలుకుంటున్నారుః మెగాస్టార్

బుధవారం, 12 మే 2021 (13:40 IST)
tarak- chiru
తార‌క్ అని అంద‌రూ ముద్దుగా పిలుచుకునే నంద‌మూరి తారక రామారావు (ఎన్‌.టి.ఆర్‌.) రెండు రోజుల నాడు త‌న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌నీ, ప్ర‌స్తుతం అసొలేష‌న్‌లో వున్నాన‌నీ, అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాన‌ని వెల్ల‌డించారు. అలాగే త‌న‌ను క‌లిసివారు కూడా ఒక‌సారి ప‌రీక్ష చేసుకోండ‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖులంతా తార‌క్ ఆరోగ్యం గురించి వాక‌బు చేశారు.
 
బుధ‌వారంనాడు మెగాస్టార్ చిరంజీవికూడా తార‌క్ ఆరోగ్యం గురించి వాక‌బు చేస్తూ ఇలా ట్వీట్ చేశారు.  కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను.అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ home quarantine లో ఉన్నారు.He and his family members are doing good.తను చాలా ఉత్సాహంగా,energtic గా ఉన్నారని తెలుసుకుని I felt very happy.త్వరలోనే  పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను. 
God bless 
@tarak9999
అంటూ మెగాస్టార్ కోరుకున్నారు. ఇక ఇదేరోజు అల్లు అర్జున్ క‌రోనా నుంచి కోలుకుని పిల్ల‌ల‌తో హ్యాపీగా గ‌డిపారు. రేపు తార‌క్‌కూడా అలాగే గ‌డ‌పాల‌ని ఆశిస్తున్నాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు