నేను ఇంకా బతికే వున్నా.. తప్పుడు ప్రచారాలు ఆపండి.. శక్తిమాన్

బుధవారం, 12 మే 2021 (12:44 IST)
Mukesh Khanna
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చాలా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా బ్రతికి ఉన్న వారిని కూడా చంపేస్తున్నారు. రీసెంట్‌గా సింగర్‌ లక్కీ అలి చనిపోయాడంటూ ప్రచారం చేయగా, అవన్నీ వాస్తవాలని ఖండించాడు సదరు సింగర్. 
 
ఇక ఇప్పుడు శక్తిమాన్ సీరియల్ ఫేం ముఖేష్ ఖన్నా కూడా తాను క్షేమంగా ఉన్నానని చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది. కరోనా వలన ఆయన చనిపోయారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా స్పందించాడు.
 
నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. కోవిడ్ వలన నేను ఆసుపత్రిలో చేరినట్టు వస్తున్న వార్తలలో వాస్తవం లేదు. ఈ తప్పుడు ప్రచారాలు ఎవరు సృష్టిస్తున్నారో, ఆ ప్రచారాల వెనుక ఉద్దేశం ఏంటో కూడా అర్ధం కావడం లేదు. 
 
ఏం చేస్తే ఇలాంటివి మానేస్తారు. సోషల్ మీడియా వలనే ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. ఫేక్ న్యూస్ సృష్టించి ప్రజల ఎమోషన్స్‌తో ఆడుకోవడం దారుణం. ఈ వార్తలతో విసిగిపోయాను. ఇలాంటి వార్తలు సృష్టించే వారిని కఠినంగా శిక్షించాలి అంటూ ముఖేష్ కన్నా వీడియో ద్వారా తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు