'ఒకప్పుడు నాకు క్షయ(టీబీ), హెపటైటిస్ బీ వ్యాధులు ఉండేవి. అయితే నాకు ఈ వ్యాధులు సోకినట్లు దాదాపు ఎనిమిదేళ్ల పాటు నేను గుర్తించలేకపోయాను. హెపటైటిస్ వల్ల అప్పటికే నా కాలేయం 75 శాతం పాడైంది. తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల ఇలా జరిగింది.
ఇకపోతే, 'నాలా మరొకరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఇప్పుడీ విషయాల గురించి వెల్లడించాను. అంతేకానీ, నేనోదో గొప్పకు చెప్పుకుంటానని మాత్రం భావించవద్దు. ప్రతి ఒక్కరు తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఫలితంగా వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి సులభంగా నివారించవచ్చు' అని వెల్లడించారు.