తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం జరిగింది. డ్రగ్స్‌కు బానిసై ఓ యువసంగీత దర్శకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని పేరు అనురాగ్ వినీల్. హైదరాబాద్ నాగోల్‌లోని మమతానగర్‌లో నివాసముంటున్న ఆయన అదే ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిజానికి అనురాగ్ వినీల్ గత కొంతకాలంగా మత్తుపదార్థాలకు బానిసయ్యాడని ఇరుగుపొరుగువారు చెపుతున్నారు. దీనికితోడు ఆర్థిక కష్టాల్లో చిక్కుకోవడంతోపాటు ఆయనను కొందరు వేధింపులకు గురిచేస్తుండటంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నది సమాచారం.
సంగీత దర్శకుడిగా వినీల్ చేసిన పలు ప్రైవేట్ ఆల్బమ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈయన కంపోజ్ చేసిన పాటల్లో నీలాకాశం, రిపబ్లిక్ డే స్పెషల్‌గా వందేమాతరం అనే పాట, ఓ చెలియా.. అనే పాటలు మంచి ప్రజాదారణ పొందాయి.