హీరో మంచు మనోజ్ ఒక గంట క్రితం, మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ 40 నిమిషాల క్రితం చిత్రంపై స్పందించారు. "డేరింగ్ డాషింగ్ నటసింహ బాలయ్య అన్నకు, క్రిష్ బాబాయ్‌కి థ్యాంక్స్. శరణమా... రణమా" అని మనోజ్ ట్వీట్ చేయగా, "జీపీఎస్కే గురించి గొప్పగా రిపోర్టులు వస్తున్నాయి. చిత్ర బృందానికి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. అలాగే, "బాలయ్యా... మీరు మాలో చాలామందికి ఆదర్శం" అంటూ మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.
అలాగే, దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి కూడా ట్వీట్ చేసిన విషయం తెల్సిందే. గురువారం ఉదయమే సినిమా చూసిన ఆయన, తన ట్విట్టర్ ఖాతాలో వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. "ఈ కథను 79 రోజుల్లో ఇంత అద్భుతంగా ఎలా తీశారు? నమ్మశక్యం కావడం లేదు. మీ నుంచి నేను ఎంతో ఎంతో నేర్చుకోవాలి. సాయి మాధవ్... నీ కలమే శాతకర్ణి ఖడ్గం. అద్భుతమైన కెమెరా పనితనం, అత్యద్భుతమైన నిర్మాణ విలువలు శాతకర్ణి చిత్రాన్ని సుదీర్ఘకాలం పాటు గుర్తుండిపోయేలా చేశాయి. ఈ చిత్రం తెలుగు పరిశ్రమకు గర్వకారణం" అని ఆయన ట్వీట్ చేశారు.