తెలుగు సినిమాకు పూర్వవైభవం తీసుకు వచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్ - ఎఫ్3 టీమ్
సోమవారం, 30 మే 2022 (17:57 IST)
Venkatesh, Varun Tej, Anil Ravipudi, ali
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, దిల్‌రాజు కాంబినేషన్లో విడుదలైన సినిమా ఎఫ్3. మే 27న విడుదలై డబుల్ హ్యాట్రిక్ సాధించింది. ఈ సందర్భంగా బ్లాక్ బస్టర్ హిట్ వేడుకను హైదరాబాద్ దస్పల్లా హోటల్లో సోమవారంనాడు చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అంతా పాల్గొంది.
విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ, నాకు నిజంగా చాలా సంతోషంగా వుంది. తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చినందుకు హ్యాపీగా ఫీలవుతున్నాను. బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. నేను మాటల్లో చెప్పలేను. ఈ సినిమా షూటింగ్ జరిగిన 100 రోజుల్లోనూ పాజటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి. ప్రతీ సీన్ చేసేటప్పుడు ఎంకరేజ్ మెంట్ వండర్ఫుల్ అనుభవం. అలాంటిదే ప్రేక్షకులు ఇచ్చారు. రియల్ టీమ్ వర్క్ ఇది. ఎఫ్2 తర్వాత ఎఫ్3 చేశారంటే ప్రతి ఒక్కరూ స్వంత సినిమాగా భావించి చేశారు. ప్రేక్షకులు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్‌కు వస్తున్నారు. వెరీవెరీ హ్యాపీ. నా అభిమానులు థియేటర్లో నన్ను చూసి మూడేళ్ళయింది. నా సినిమా చూసి మనస్పూర్తిగా అభినందిస్తున్న ఇండస్ట్రీలోనివారికి థ్యాంక్స్ చెబుతున్నా. నాకు చాలా కాల్స్ వచ్చాయి. అందరికీ వెరీవెరీ థ్యాంక్స్ అన్నారు.
వరుణ్‌తేజ్ మాట్లడుతూ, ఎఫ్3 సినిమాను సక్సెస్ చేసిన తెలుగుప్రేక్షకులకు థ్యాంక్స్. సహజంగా యాక్షన్, మైథలాజికల్ సినిమాలను ఎంకరేజ్ చేస్తుంటారు. ఆ కోవలోనే ఎఫ్3 సినిమాను సక్సెస్ చేశారు. పిల్లలు కూడా సినిమా చూసి డాన్స్ చేస్తున్నారు. ఇలాంటి సినిమా తీసి ప్రెస్టేషన్ లేకుండా చేసిన దర్శకుడు అనిల్‌గారికి థ్యాంక్స్. మా ఎఫ్3 కుటుంబ సభ్యలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కోవిడ్‌లో టైంలో ఇంటిలోవారికంటే ఈ టీమ్‌తోనే ఎక్కవ సేపు గడిపాను. రాజేంద్రప్రసాద్‌గారు నాకు ఫ్రెండ్ లాంటివారు. వెంకటేష్‌గారికి, దిల్‌రాజు, అలిల్ గారికి బిగ్ థ్యాంక్స్. ఇంకా మిగతా ఫంక్షన్లలో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం అని అన్నారు.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, నా 45 ఏళ్ళ సినీ జీవితంలో నాకు నచ్చిందే చెప్పాను. ఎఫ్3 సినిమా చూశాక ఈ సినిమా హిట్ కాకపోతే మొహం చూపించనని అన్నాను. అందుకే నేను మాస్క్ వేసుకుని ఇలా వచ్చాను. ఇప్పుడు నిజమైన సక్సెస్ ప్రేక్షకులు ఇచ్చారు. ఈ సినిమాను త్రిబుల్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. సోమవారంనాడు కూడా గుంటూరుతో అన్ని ప్రాంతాల్లో హౌస్ ఫుల్ అయ్యాయి. ఈ సినిమాను రెండు నమ్ముకుని తీశాం. ఒకటి నవ్వు. రెండు ప్రేక్షకులు నమ్ముకుని తీశాం. 45 ఏళ్ళుగా నేను నవ్వునే నమ్ముకుని సినిమాలు చేస్తున్నాను. అలా ఎఫ్2,ఎఫ్3 చేశాను. ప్రపంచంలోని నలుమూలలనుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. మళ్ళీ మీ రోజులు గుర్తుకువచ్చాయి అంటూ నాతో అంటున్నారు. నాకు మాత్రం `మాయలోడు` సినిమా గుర్తుకు వచ్చింది. మనకు పండుగ రోజుల్లో పాత సినిమాలు టీవీల్లో వేస్తుంటారు. గుండమ్మకథ, అప్పుచేసి పప్పుకూడు.. వంటి చిత్రాలు నవ్వులు పూయిస్తుంటాయి. అలా ఎఫ్3 నవ్వులు పూయించింది అని తెలిపారు.
అలీ మాట్లాడుతూ, అద్భుతమైన హిట్ ఇచ్చిన ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈరోజు నిజమైన పండగు రోజు. సోమవారం కూడా హౌస్‌ఫుల్ అవ్వడానికి కారణం ఈ బేనర్ కున్న విలువ, దర్శకుడు అనిల్‌రావిపూడి, హీరోలైన వెంకటేష్, వరుణ్‌తేజ్ పై వున్న నమ్మకం. సినిమా బాగుంటే ఎంత పెద్ద హిట్ ఇస్తారనేందుకు ఎఫ్3 నిదర్శనం. చాలామంది ఫోన్లు చేసి రెండు, మూడు సార్లు చూశామంటున్నారు. సినిమా హిట్ అయితే అందరూ బాగుంటారు. కొంతమంది హిట్ అయిన సినిమాను బాగోలేదని ప్రచారం చేస్తున్నారు. ఇలా చేయడం సరైందికాదని మనవి. ఎందుకంటే మీరుకూడా సినిమాను నమ్ముకున్నవారే కదా. గతంలో చెన్నైలో వుండగా ఇలాంటి వార్తలు వినిపించేవికాదు. ఒకరి సినిమా హిట్ అయితే మరొకరు బాధపడడం ఏమిటో అర్థంకాదు. అవతలివారు బాగుండాలి అని కోరుకుంటే దేవుడు మనల్ని బాగా చూస్తాడు. అనిల్‌గారు నా చేతికి గన్ ఇచ్చి చేయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది చాలా అద్భుతమైన పండుగ. అందులో నేనూ వుండడం చాలా ఆనందంగా వుంది అన్నారు.
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, నాకిది 6వ సినిమా. ఉదయమే ఒక ఫోన్ కాల్ వస్తే బ్లాక్ బస్టర్. నాకు ప్రతిసారీ వి.వి. వినాయక్‌గారు చేస్తుంటారు. ఇలా ఆరోసారి చేశారు. ఇంకా చాలామంది ఫోన్లు చేశారు. మైత్రీమూవీస్వారు పర్సనల్‌గా కాల్ చేశారు. డి.సురేష్‌బాబుగారు సినిమా విడుదలకుముందే చూశారు. ఆయన ముందే హిట్ అన్నారు. అలా నా సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈనెల 27న విడుదలై నేటికీ కలెక్షన్ల వర్షం కురుస్తూనే వుంది. ఈ వీక్ కూడా ఎగ్జిబిటర్లకు, కొన్న పంపిణీదారులకు కలెక్షన్లతో నవ్వులు పూయించాలని కోరుకుంటున్నా. ఈరోజు సినిమాను జనాలముందుకు తీసుకెళ్ళాలంటే ప్రమోషన్ కీలకం. అందుకు వంశీ శేఖర్, నాని, మనోజ్‌లకు ధన్యవాదాలు. నైజాంలో దాదాపు 9లక్షల 50వేల మంది ఆడియన్స్ చూశారు. పాండమిక్ తర్వాత సినిమారంగం ఇబ్బందిలోవుంది. అందుకే ప్రతి సెక్షన్‌కు సినిమా చేరువకావాలని కోరుకున్నాం. అందుకు అఖండ, పుష్ప, ఆర్.ఆర్.ఆర్., భీమ్లానాయక్, సర్కారువారిపాట చిత్రాలు థియేటర్‌కు ప్రేక్షకులను తీసుకు వచ్చాయి. ఇప్పుడు ఎఫ్3 తీసుకువచ్చింది. తెలుగు సినిమాకు పూర్వవైభవం తీసుకు వచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ సినిమాకు నా వెన్నంటి వుండి బలంగా నిలబడిన దిల్‌రాజు, శిరీష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.
శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ, రాజేంద్రప్రసాద్‌గారు బాగా యాక్ట్ చేస్తారు. ఆయన ఒరిజినల్ మెటీరియల్. వెంకటేష్ సార్‌తో నటించడం చాలా అదృష్టంగా ఫీలవుతున్నా. చిన్నతనం నుంచి ఆయన సినిమాలు చూశాను. వెంకటేష్‌కు ఫాదర్‌గా చేయాలనేకోరిక వుంది. ఇక ప్రదీప్ గారు.. అంతేగా.. అంటూనే కరాటే ఇరగదీశారు. అలీగారు బాగా నటించారు. దాదాపు 40 మంది ఆర్టిస్టులను మేనేజ్ చేసిన దర్శకుడు అనిల్ రావిపూడిగారికి ధన్యవాదాలు. ఆయన టైమింగ్ ప్రకారం చిన్న షాట్ ను కూడా చక్కగా చేయించారు. ఇలాగే ఎఫ్ సిరీస్‌తో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. గాలి సంపత్తో చిన్న అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు. అదేవిధంగా మమ్మల్ని ప్రోత్సహించిన దిల్‌రాజు, శిరీష్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇందులో కార్తికేయ, రిషి అనే బాలనటీనటులుకూడా బాగా యాక్ట్ చేశారు అని తెలిపారు.
ప్రదీప్ మాట్లాడుతూ, ఆనందం ఎక్కువైతే మాటలు బయకుట రావు. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు. ముద్దమందారం చిత్రం అప్పుడు జూబ్లీ వేడుక చూశాను. ఇప్పుడు ఎఫ్3తో చూస్తున్నాను. చాలా ఆనందంగా వుంది. ప్రతిరోజూ ఫన్ సెట్లోనే వుంది. వెంకటేష్ బాగా చేశాడనడం చందమామ బాగుందని చెప్పడమే. వరుణ్‌తేజ్ మేనరిజం కంటెన్యూగా ప్లే చేయడం చాలా కష్టమైన పని దాన్ని ఆయన చేసి చూపించారు. రాజేంద్రప్రసాద్‌గారు కేరెక్టర్లో క్షణంలో ఇమిడిపోతారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు ప్రదీక్కు మంచి పేరు వస్తుంది అన్నారు. లీడర్‌కు రెండు లక్షణాలు వుండాలి. ఒకటి టాస్క్. రెండు రిలేషన్. ఇవి వున్న దర్శకుడు అనిల్ రావిపూడి. రిటైర్ అయిపోయాను అనుకున్న టైంలో రీ-యాక్ట్ చేసేలా చేసిన దర్శకుడికి థ్యాంక్స్ అని అన్నారు.
ప్రగతి మాట్లాడుతూ, ఇంత హిట్ చేసిన ప్రేక్షకులకు రుణపడి వుంటాను. ఎన్ని మంచి పాత్రలు చేసినా ఏదో వెలితి అనిపించేది. అది ఎఫ్2 తో దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు ఎఫ్3 వచ్చింది. మంచి అవకాశాల కోసం నమ్మకంతో వెయిట్ చేశాను. అవకాశం తలుపు తట్టినప్పుడు సద్వినియోగం చేసుకున్నాను. వెంకటేష్ గారిలో సింపుల్సిటీ, సమయపాలన, కలిసిమెలిసి వుండడం, టైమింగ్ వంటి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. రాజేంద్రప్రసాద్‌గారిది చిన్నపిల్లాడి మనస్తత్వం.. ఆయన టైమింగ్ పర్సన్. అందుకే అంత పెద్ద స్టార్ అయ్యారు. వరుణ్‌తేజ్ ప్రతి సినిమాలో ఇంప్రూవ్మెంట్ చేస్తూనే వున్నాను. అహంకారంలేకుండా మెచ్చూరిటీగా నటించారు అని తెలిపారు.
శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కరోనా మూడో వేవ్ అయిపోయి నవ్వుల వేవ్ మొదలైంది. చాన్నాళ్ళ తర్వాత లేడీస్, పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ఎఫ్3లా ఇంకా పలు చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను. పిల్లలు ఫోన్లతో ఆడుకోవడం మానేసి చదువుకుంటున్నారు. ఈ ఎపిసోడ్‌ను దర్శకుడు బాగా డీల్ చేశాడు అని తెలిపారు.
జెమినీ సురేష్ మాట్లాడుతూ, అనిల్, దిల్‌రాజు, శిరీష్‌గారికి థ్యాంక్స్. ఎఫ్3 పల్లకిని వెంకటేష్, వరుణ్ తేజ్మోసి సక్సెస్ చేశారు. వరుణ్‌తేజ్ పాత్రలో నత్తి మేనరిజం ఎక్కడా మిస్‌కాకుండా చేశారు. హిట్ అంటే ఇట్టా వుండాలని నిరూపించారు. బెంగుళూరులో మ్యూజిక్ దర్శకుడు సతీష్‌గారి అమ్మాయి అస్సలు నవ్వదట. కానీ ఈ సినిమా చూసి తెగ నవ్వేసిందని చెప్పడం చాలా ఆనందంగా వుందని అన్నారు.
స్టన్ శివ మాట్లాడుతూ, దర్శకుడు అనిల్‌గారు నన్ను కామెడీ విలన్‌గా మార్చారు. చాలా స్ట్రాంగ్‌గా వెంకటేష్‌గారు నన్ను రికమండ్ చేశారు. అందుకు థ్యాంక్స్. వెంకీగారి కామెడీ ఎక్స్ ట్రాడనరీ. వరుణ్ తేజ్ కామెడీ హైలైట్. దిల్ సినిమాకు ఫైట్ మాస్టర్‌ను. ఎఫ్3కి నటుడుగా చేశాను అని తెలిపారు.
అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ, ప్రేక్షకులకు రోగాలులేకుండా హాయిగా నవ్వుకునేలా సినిమా తీసిన అనిల్‌గారికి దన్యవాదాలు. మాకు పేరు వచ్చిందంటే కారణం ఆయనే. ఈ సినిమా చూశాక వందేళ్ళు బతుతుతామనే కోరిక బలంగా ఏర్పడిందని అన్నారు.
వై. విజయ మాట్లాడుతూ, సినిమా చేసేటప్పుడే సూపర్ డూపర్ హిట్ అవుతుందని అనుకున్నాం. అలాగే అయింది. ఇందులో నటించినందుకు గర్వంగా వుంది. వెంకటేష్‌గారితో కలియుగ పాండవులు నుంచి చేశాను. దిల్‌రాజు, శిరీష్‌గారి సినిమాలు మరిన్ని హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.