విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసింది: రేణూ దేశాయ్

ఐవీఆర్

ఆదివారం, 5 జనవరి 2025 (16:57 IST)
విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసిందని అన్నారు రేణూ దేశాయ్. తూర్పు గోదావరి జిల్లాలోని రాజా నగరం మండలం లోని నరేంద్రపురంలో ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ కి చెందిన 5 రకాల ఉత్పత్తులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పాశ్చాత్య ఆహారం కంటే దక్షిణాది ఇడ్లీ, ఉప్మా, పెసరట్టు ఎంతో మేలైనవని కితాబుచ్చారు.
 
విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ వస్తున్నప్పుడు మధ్యలో వున్న పచ్చని అందాలను చూసేందుకు తనకు రెండు కళ్లు సరిపోలేదని అన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కూడా రావాలని పెద్దలు చెబుతున్నారనీ, ఇక్కడ కూడా ఇండస్ట్రీ అభివృద్ధి చెందితే ఎంతో బాగుంటుందని అన్నారు. అకిరా నందన్ సినీ ప్రవేశం గురించి చెబుతూ... అకిరా సినిమాల్లో నటించాలని తను కూడా కోరుకుంటున్నాననీ, తనను సినిమాల్లో చూడాలన్న ఆత్రుత తనకి కూడా వుందని అన్నారు. అలాగని అతడిపై తను ఒత్తిడి తీసుకురాననీ, ఇష్టంతోనే సినిమాల్లో నటిస్తాడని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు