అందరూ సమానమే కాన్సెప్ట్ తో ది ఇండియన్ స్టోరి

డీవీ

గురువారం, 2 మే 2024 (16:47 IST)
రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ది ఇండియన్ స్టోరి. చమ్మక్ చంద్ర, ముక్తార్ ఖాన్, రామరాజు, సమీర్, సి.వి.ఎల్ నరసింహారావు, అనంత్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ బ్యానర్ పై రాజ్ భీమ్ రెడ్డి నిర్మించారు. మన సమాజంలో మత సామరస్యం ఉండాలనే మంచి సందేశంతో అన్ని కమర్షియల్ అంశాలు కలిపి ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి. రేపు ఈ సినిమా గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా నిర్వహించారు.
 
దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ - అన్ని మతాలూ సమానమే. మనుషులంతా ఒక్కటే అనే మంచి కాన్సెప్ట్ తో ది ఇండియన్ స్టోరి సినిమాను రూపొందించాం. కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థంతో మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఈ విషయాన్ని మా మూవీలో చర్చించాం. దీంతో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మా టీమ్ కు హెచ్చరికలు చేశారు. మాపై కేసులు పెట్టారు. దాడులు చేసేందుకు ప్రయత్నించారు. అయినా మేము భయపడకుండా సినిమాను రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మా సినిమాలో సందేశం ఉన్నా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. కామెడీ, యాక్షన్, లవ్, డ్రామా, ఎమోషన్ వంటి అంశాలతో ది ఇండియన్ స్టోరి సినిమా ఆకట్టుకుంటుంది. అన్నారు.
 
నిర్మాత, హీరో రాజ్ భీమ్ రెడ్డి మాట్లాడుతూ - ది ఇండియన్ స్టోరి సినిమా మేము నిర్మించడం వెనక ఎలాంటి రాజకీయ శక్తులు లేవు. ఒక మంచి సందేశాత్మక సినిమా కమర్షియల్ అంశాలతో రూపొందించే ప్రయత్నం చేశాం. సెన్సార్ విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాం. నా విజ్ఞప్తి ఒక్కటే ఏ భాషలో అయినా స్థానిక భాష తెలిసిన సెన్సార్ ఆఫీసర్ ఉండాలి. తెలుగు సినిమాల సెన్సార్ కు తెలుగు తెలిసిన అధికారులే ఉండాలి. అప్పుడే మన సినిమాల్లోని భావోద్వేగాలను సరిగ్గా అర్థం చేసుకోగలరు. ది ఇండియన్ స్టోరి సినిమాను అందరికీ నచ్చేలా తెరకెక్కించడంలో టీమ్ అంతా ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమా మీరు అనుకున్నట్లు సీరియస్ సబ్జెక్ట్ తో ఉండదు. కామెడీ, యాక్షన్, డ్రామా అన్నీ ఉంటాయి. చమ్మక్ చంద్రతో నా సీన్స్ హిలేరియస్ గా వచ్చాయి. మీ మొదటి సినిమాను ఇలాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్ తో ఎందుకు చేశారని చాలా మంది అడుగుతున్నారు. ఇది సెన్సిటివ్ సబ్జెక్ట్ అయినా మేము సమాజానికి ఏ నెగిటివ్ మెసేజ్ వెళ్లకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేశాం. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా కథను నడిపాం. సెన్సార్ వాళ్లకు కూడా సబబే అనిపించేలా మూవీ ఉంటుంది. ఎడిటర్ జేపి గారు, డైరెక్షన్ టీమ్, రైటింగ్ టీమ్ ప్యాషన్ తో పనిచేశారు. వన్ మీడియా పార్థు పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం చూసుకున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంతోషంగానే ఉన్నాం. అలాగే సినిమాను రేపు థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. ఈ వారం ఎన్ని సినిమాలు రిలీజైన బాక్సాఫీస్ విన్నర్ ది ఇండియన్ స్టోరి అవుతుందని నమ్మకంగా చెప్పగలం. నా నెక్ట్ మూవీ యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉంటుంది. యానిమల్, కేజీఎఫ్ కలిస్తే ఎలా ఉంటుందో అంత యాక్షన్ ఉంటుంది. ఆ సినిమాకు లూథర్ అనే టైటిల్ పెట్టాం. మరికొద్ది రోజుల్లో ఆ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తాం. అన్నారు.
 
హీరోయిన్ జరా ఖాన్ మాట్లాడుతూ - తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను ముంబై నుంచి వచ్చాను. ది ఇండియన్ స్టోరి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఈ మూవీలో హీరోయిన్ గా నటించాను. యాక్టింగ్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ తో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టడం అదృష్టంగా భావిస్తున్నా. ముంబైలో తెలుగు డబ్బింగ్ సినిమాలో చాలా వస్తుంటాయి. అవి చూశాక ఇక్కడి ఇండస్ట్రీ ఎంత పెద్ద పరిశ్రమో అర్థమైంది. ది ఇండియన్ స్టోరీ సినిమా చూడండి. మంచి కాన్సెప్ట్, మెసేజ్, ఎంటర్ టైన్ మెంట్ అన్నీ ఉన్నాయి. అన్నారు.
 
సహ నిర్మాత కమల్ హాసన్ పాత్రుని మాట్లాడుతూ - ది ఇండియన్ స్టోరి సినిమాకు సపోర్ట్ చేసేందుకు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్స్. టీమ్ వర్క్ గా కష్టపడిన మా యూనిట్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాను ఇక్కడి దాకా తీసుకొచ్చే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఆ ప్రాబ్లమ్స్ కూడా హ్యాపీగానే ఫేస్ చేశాం. ది ఇండియన్ స్టోరి సినిమాను థియేటర్స్ లో చూడండి. అన్నారు.
 
ఎడిటర్ జేపి మాట్లాడుతూ - మా మూవీ ట్రైలర్ మీకు నచ్చినట్లే..సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను రేపు గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా చూశాక మీలో ఒక మంచి ఆలోచన మొదలవుతుంది. మతం పేరుతో గొడవలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకుంటారు. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే ఆలోచింపజేసే సినిమా అవుతుంది. అన్నారు.
 
వన్ మీడియా పార్థు మాట్లాడుతూ - ది ఇండియన్ స్టోరి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం నా ఆధ్వర్యంలోనే జరిగింది. సినిమాకు వర్క్ చేస్తున్న క్రమంలోనే ఓ మంచి సినిమాలో భాగమయ్యానని హ్యాపీగా అనిపించింది. దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి, నిర్మాత హీరో రాజ్ భీమ్ రెడ్డి ఒక మంచి ప్రయత్నం చేశారు. ప్రేక్షకులంతా ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటీనటులు - రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్, చమ్మక్ చంద్ర, సమీర్, సీవీఎల్ నరసింహారావు, అనంత్ తదితరులు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు