ది జంగిల్ బుక్ : బాక్సాఫీస్ కలెక్షన్లతో రికార్డులు తిరగరాస్తోంది!

సోమవారం, 9 మే 2016 (11:58 IST)
ఇటీవల విడుదలైన హాలీవుడ్‌ చిత్రం ''ది జంగిల్‌బుక్'' కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జాన్‌ ఫారో దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారత్‌లో విడుదలై రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. 1967లో వాల్ట్‌డిస్నీ సంస్థ నుంచి కార్టూన్ యానిమేషన్ చిత్రంగా విడుదలై బుల్లి, వెండితెరలపై ఆకట్టుకున్న ఈ కథ ఇప్పుడు భారీ యానిమేషన్‌తో అత్యంత ఆధునాతనంగా రూపొందించబడి పిల్లల్నీ, పెద్దల్నీ ఆకర్షిస్తోంది. ఇంగ్లీష్‌లోని ఈ హాలీవుడ్ చిత్రానికి హిందీ, తెలుగు, తమిళ భారతీయ ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. మన దేశంలో దాదాపు 1700 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు వసూళ్ళలో పెను సంచలనం సృష్టిస్తోంది.
 
''ది జంగిల్ బుక్'' కథాంశం ఏంటంటే అడవిలోని పసిబాలుడు మోగ్లీని తోడేళ్ళు పెంచడం, ఎలుగుబంటి, కొండ చిలువ వంటి రకరకాల అడవి క్రూర మృగాలతో అతని స్నేహం మధ్య ఈ కథ సాగుతుంది. భారతీయ సంతతికి చెందిన నీల్‌సేథీ ఈ సినిమాలో మోగ్లీ పాత్ర పోషించగా, హైదరాబాద్‌కు చెందిన ఏడోతరగతి కుర్రాడు పదేళ్ళ సంకల్ప్ ఆ పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ సినిమాకు విడుదలైన ఒక్క మన దేశంలో తొలి రోజే సుమారు రూ.10.09 కోట్ల వసూళ్ళు ను రాబట్టింది. 
 
రెండో రోజు రూ.13.5 కోట్లను సాధించింది. ఇక మూడో రోజు రూ. 16.6 కోట్లు వసూళ్ళను చేజిక్కించుకుంది. అన్నీ కలిపి, రిలీజైన తొలి వారాంతానికే రూ. 40 కోట్ల పైగా రాబట్టడం విశేషం. మన దేశంలో తొలి మూడు రోజులకే ఇంత భారీ వసూళ్ళు సాధించిన రెండో హాలీవుడ్ చిత్రం ''ది జంగిల్ బుక్'' కావడం గమనార్హం. ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.240.34కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని బాలీవుడ్‌ చిత్ర విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు. 

వెబ్దునియా పై చదవండి