మహేశ్ స్టైలిష్ లుక్, ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, తనదైన ట్రేడ్ మార్క్ డైలాగ్ డెలివరీతో పాటు సినిమాటోగ్రఫర్ మది కెమెరా వర్క్, యాక్షన్ సీన్స్, బ్యూటీఫుల్ కీర్తిసురేవ్, నిర్మాణ విలువలతో బ్లాస్టర్ ప్రేక్షకాభిమానులకు రియల్ ఫీస్ట్‌గా మారింది.
సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా, పండగ ఫెస్టివల్‌గా జనవరి 13న విడుదల కాబోతున్నట్లు బ్లాస్టర్‌లో కన్‌ఫర్మ్ అయ్యింది. ఉన్న భారీ అంచనాలతో సూపర్‌స్టార్ ఫ్యాన్స్ బ్లాస్టర్ రిలీజ్‌కే సినిమా రిలీజ్ అంతా హంగామాను క్రియేట్ చేశారు. ఇక సినిమా రిలీజ్ సమయంలో ఫ్యాన్స్ ఎంత పెద్ద హంగామా చేస్తారో చూడాలి. పర్‌ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్.మది సినిమాటోగ్రాఫర్, ఎస్.ఎస్.తమన్ సంగీతం, మార్తాండ్ కె.వెంకటేశ్ ఎడిటర్, ఎ.ఎస్.ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు.