నేను ఇండస్ట్రీకి వచ్చి పదహారేళ్ల అవుతుంది. ఈ పదహారేళ్లలో ఎక్కడ కూడా బోర్ కొట్టించని సినిమాలే చేశానని భావిస్తున్నాను. రానున్న రొజులలో చాలా మార్పులు రాబోతున్నాయి. పెద్ద రెవల్యూషన్ రాబోతుంది. నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ రాబోతున్నారు. ఆ మార్పు కి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతి క్యారెక్టర్ లో ది బెస్ట్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను అని శ్రీవిష్ణు అన్నారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో #సింగిల్‌తో అలరించబోతున్నారు. కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. #సింగిల్ మే 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు సినిమా విశేషాలు పంచుకున్నారు.
- మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుల్ని నవ్వించాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. కొత్త కథ, స్క్రీన్ ప్లే ఉంటుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇంటర్వెల్ క్లైమాక్స్ కొత్తగా ఉంటాయి. అన్ని సన్నివేశాలు కూడా మనల్ని మనం రిలేట్ చేసుకునేలా ఉంటాయి. యంగ్స్టర్స్ అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా సినిమా చూడొచ్చు. మేము అనుకున్నది స్క్రీన్ మీదకి చాలా అద్భుతంగా వచ్చింది. ఆడియన్స్ సినిమా చూసి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.
-గీతా ఆర్ట్స్ లో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఎప్పటినుంచో గీతా ఆర్ట్స్ లో చేయాలి. లక్కీగా ఈ సినిమా కుదిరింది 100% కాన్ఫిడెన్స్ ఉన్న జోనర్ ఇది. ఈ జోనర్ లో గీత ఆర్ట్స్ తో చేయడం వెరీ వెరీ హ్యాపీ.
- డైరెక్టర్ కార్తీక్ రాజుగా కథ చెప్పినప్పుడు చాలా మంచి ఎంటర్టైనర్ అవుతుందని నమ్మకం కలిగింది. ఫైనల్ గా సినిమా చూసుకున్న తర్వాత చాలా పెద్ద ఎంటర్టైనర్ అవుతుందని అనిపించింది.
-చాలా కొత్త క్లైమాక్స్ ఇది. అందరికీ నచ్చుతుంది. నా క్యారెక్టర్, వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్. ఇద్దరు హీరోయిన్స్ క్యారెక్టర్స్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ నాలుగు క్యారెక్టర్లు కూడా ఆడియన్స్ కి చాలా నచ్చుతాయి. క్లైమాక్స్ చాలా యూనిక్ గా ఉంటుంది. అందరిని ఎంటర్టైన్ చేస్తుంది.
-సినిమాని కంప్లీట్ గా హైదరాబాద్ లో తీసాం హైదరాబాద్ని చాలా కొత్తగా చూపించాం. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ ని ఇంత కొత్తగా ఎవరు చూపించలేదు. చాలా బెస్ట్ మూమెంట్స్ ని క్యాప్చర్ చేశాం. అలాగే ట్రైలర్ లో చిరంజీవి, బాలక్రిష్ణగారి గురించి టచ్ చేశాం. కానీ మంచు విష్ణు గురించి సెటైరిక్ గా మాట్లాడినట్లుగా రెండు డైలాగ్ లు విమర్శలకు దారితీశాయి. భవిష్యత్ లో ఇలాంటివి చేయకూడదని సింగిల్ సినిమా ద్వారా తెలుసుకున్నాను.
-సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాల తర్వాత వచ్చిన సినిమా కావడంతో స్వాగ్ ఒక ఫుల్ కామెడీ సినిమా అనుకున్నారు. మేము కూడా ప్రాపర్ కంటెంట్ ఇలా ఉంటుందని ప్రిపేర్ చేయలేకపోయాం. అందుకే చిన్న కన్ఫ్యూజన్ ఏర్పడిందని అనుకుంటున్నాను. ఫుల్ ఫన్ అని వచ్చిన వాళ్ళు కొంత డిసప్పాయింట్మెంట్ అయిన మాట నిజమే. ఒక డిఫరెంట్ కంటెంట్ సినిమా చూడాలనే ఆడియన్స్ కి సినిమా చాలా నచ్చింది. టెలివిజన్ లో వచ్చిన తర్వాత కూడా చాలా మంచి అప్లోజ్ వచ్చింది. ప్రయోగం చేసినప్పుడు వర్క్ కాకపోతే దానిని ఎక్స్పీరియన్స్ కింద చూడాలి. వర్క్ అయినా వర్క్ కాకపోయినా కొత్త ప్రయత్నం మానకూడదని నా అభిప్రాయం.
కొత్తగా మృత్యుంజయ అనే ఒక థ్రిల్లర్ చేస్తున్నాను. అలాగే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాను.అలాగే ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్నాను.