No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

దేవీ

బుధవారం, 7 మే 2025 (13:44 IST)
Single poster, sri vishnu
సినిమాలలో తెలుగు భాష కొరవడుతుంది. దానికితోడు తెలంగాణ బాష కూడా వచ్చేసింది. అయితే ఏ సినిమా చేసినా అందులో పబ్లిసిటీపరంగా పోస్టర్లలో తెలుగుదనం అనేది కనిపించడంలేదు. తెలుగుబాష గురించి, ఔన్నత్యం గురించి ఎవరెంత స్పీచ్ లు ఇచ్చినా యూత్ ను బాగా ఆకట్టుకునేది సినిమాలోని భాష మాత్రమే. అయితే ఇటీవల వస్తున్న తెలుగు సినిమాలలో ఎక్కడా టైటిల్ పేరు తెలుగులో కనిపించదు. అంతా ఆంగ్లమయమే. తాజాగా శ్రీవిష్ణు నటించిన  #సింగిల్ సినిమా పోస్టర్లు మచ్చుకు తెలుగుదనం కనిపించలేదు.
 
పక్క రాష్ట్రం తమిళనాడు కానీ, మలయాళంకానీ వారి భాషపై నటీనటులకు, దర్శక నిర్మాతలకు వున్న గౌరవం తెలిసిందే. ఏకంగా వారి టైటిల్స్ తోనే సినిమాలు తెలుగులో డబ్ చేస్తుండం విశేషం. దీనిపై ఛాంబర్ కానీ, సినీ పెద్దలు కానీ మౌనం వహించడం విశేషమే మరి. గతంలో దీనిపై కొందరు పరుచూరి గోపాలక్రిష్ణ వంటివారు తెలుగు టైటిల్స్ రావాలని పట్టుబట్టినా ఆ తర్వాత అవి కనుమరుగవడం జరిగింది.
 
తాజాగా  #సింగిల్ సినిమా పోస్టర్లు లో అన్నీ ఇంగ్లీషుపదాలే. సాంకేతిక సిబ్బంది, టైటిల్ లో కానీ తెలుగు అక్షరం కనిపించడం. ఇది చూడ్డానికి హాలీవుడ్ సినిమా అనే ప్రశ్న తలెత్తుతుంది. తెలుగు టైటిల్ గురించి శ్రీవిష్ణు మాట్లాడుతూ, నా సినిమాలు చాలా అర్థవంతమైన తెలుగు టైటిల్స్ వుంటాయి. సామజవరగమన, రాజరాజచోర, అర్జున ఫాల్గుణ, వీరభోగవసంతరాయలు, బ్రోచెవరెవరు, ఓం భీం బుష్ వంటి పేర్లతో వచ్చాను. నాకు తెలుగంటే గౌరవం అని కూడా చెబుతున్నారు. కానీ సింగిల్ సినిమా విషయంలో పోస్టర్లలో వున్న బాష మాత్రం తనకు తెలీకుండా చిత్ర టీమ్ చేశారనీ, ఒకరకంగా అలా వుండాల్సింది కాదని అంటున్నారు.
 
గతంలో ఇదే విషయంలో దిల్ రాజు మాట్లాడుతూ, టైటిల్స్ తెలుగులోనే పెట్టాలని  అంటూనే, ఇప్పటి జనరేషన్ కు అచ్చమైన తెలుగు పదాలుఅర్థంకావని సినిమా విశ్వవ్యాప్తం అయింది కనుక మార్కెట్ పరంగా అలా వుండాల్సి వస్తుందని కర్రఇరగకుండా పాము చావకుండా చెప్పారు. ఏది ఏమైనా తెలుగు టైటిల్స్ పై కనీసం శ్రద్ధ వహించాలని సినీ విశ్లేషకులు కోరుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు