శ్రీవిష్ణు మాట్లాడుతూ...'శ్వాగ్'కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా లేడీస్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విపరీతమైన అప్రిషియేషన్ వస్తోంది. కథ, పెర్ఫార్మెన్స్, కొత్త కంటెంట్ ను ప్రేక్షకులు చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు. తెలుగు ప్రేక్షకులు కొత్త కంటెంట్ ఎప్పుడు చేసిన ఆదరిస్తారనే ధైర్యంతో ఈ సినిమా చేయడం జరిగింది. అలాగే రిసీవ్ చేసుకుంటున్నారు. నా క్యారెక్టర్స్, గెటప్స్ కి ఆడియన్స్ నుంచి చాలా మంచి అప్లాజ్ రావడం ఆనందంగా వుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మార్నింగ్ నుంచి ఇండస్ట్రీ, మీడియా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ నుంచి వచ్చినన్ని కాల్స్ మరే సినిమాకి రాలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత విశ్వప్రసాద్ గారికి, డైరెక్టర్ హసిత్, టీం అందరికీ చాలా థాంక్స్. సినిమా తప్పకుండా చూడండి, ఎప్పుడూ చూడని కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. తెలుగు ప్రేక్షకులందరికీ థాంక్ యూ'అన్నారు
హీరోయిన్ రీతూ వర్మ మాట్లాడుతూ.. ఫస్ట్ డే ఫస్ట్ షో ఆడియన్స్ తో కలసి చూశాం. ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బావుంది. నాకు స్టొరీ తెలిసినప్పటికీ థియేటర్ లో మూవీ చూసినప్పుడు చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా నచ్చింది. సినిమాలో చాలా అద్భుతమైన ఎమోషన్ వుంది. ఇప్పటివరకూ సినిమా చూసిన అందరికీ థాంక్ యూ. తప్పకుండా సినిమా చూడండి మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు.
దక్ష నాగర్కర్ మాట్లాడుతూ.. మా సినిమా గురించి అందరూ చాలా అద్భుతంగా మాట్లాడుకుంటున్నారు. పెర్ఫార్మెన్స్, క్యారెక్టర్స్, డైరెక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్ ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమా చూడండి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది' అన్నారు
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. శ్వాగ్ కూడా కమర్షియల్ ఫిల్మే, కంటెంట్ పరంగా లాంగ్ పిరియడ్ గుర్తుండిపోయే సినిమా అని నమ్మే తీశాం. మేము అనుకున్నట్లు సినిమా వచ్చింది. శ్రీవిష్ణు గారికి క్యారెక్టర్స్, గెటప్స్ కి చాలా అద్భుతమైన అప్లాజ్ వస్తోంది. మార్నింగ్ '35 చిన్న కథ కాదు' ఫిల్మ్ ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందని అన్నారు. ఎందుకంటే.. 35 సినిమాకి నేషనల్ అవార్డ్ వస్తుందని అనుకున్నాం ఇప్పుడు మీరు కొట్టేస్తున్నారని అభినందించారు. మార్నింగ్ నుంచి అన్ని చోట్ల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇన్ని క్యారెక్టర్స్ తో ఇంత పెద్ద కథ చెప్పడం ఛాలెంజ్. ఫస్ట్ హాఫ్ వెరీ ఫేసీ అనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇంటర్వెల్ కి అంతా క్లియర్ అయి త్రూ అవుట్ సినిమాని ఎంజాయ్ చేశామని చెబుతున్నారు. సినిమా ఎక్స్ ట్రార్డినరీగా ఆడుతోంది. ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ' అన్నారు.