కోబలి పార్ట్-2 మరింతగా అలరిస్తుంది అంటున్న టీం

దేవి

గురువారం, 13 ఫిబ్రవరి 2025 (16:44 IST)
Ravi prakash, venkat and others
రవి ప్రకాష్, రాకీ సింగ్ ప్రధాన పాత్రలు పోషించిన రా అండ్ రస్టిక్ వెబ్ సిరీస్ 'కోబలి సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగింది. రేవంత్ లేవాక దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 4 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో 7 భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కి అన్ని రాష్ట్రాల ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. నార్త్ నుండి కూడా దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికీ నెంబర్ వన్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది 'కోబలి'. దీంతో మేకర్స్ హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసి మీడియా వారికి, ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలుపుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 
 
ఈ సందర్భంగా రవి ప్రకాష్ మాట్లాడుతూ, నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అయ్యింది. కొత్తగా ఏదో ఒకటి చేయాలి అనే నమ్మకంతో 'కోబలి' మొదలుపెట్టాను. ఒక కాఫీ షాప్లో ఈ కథ విన్నాను. నాకు నచ్చింది. కానీ ఇది ముందుకు వెళ్తుంది అనే నమ్మకం అప్పుడు నాకు కలగలేదు. ఎందుకంటే అంతా కొత్తవాళ్లే. ఈ కంటెంట్లో అమ్ముడు పోయే మొఖం ఒక్కటి కూడా ఇందులో లేదు. అయినప్పటికీ దీనిపై నమ్మకం పెట్టింది హాట్ స్టార్. ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లింది మీడియా. ఆదరించి పెద్ద విజయాన్ని అందించింది ప్రేక్షకులు. హానెస్ట్ గా పనిచేస్తే మంచి ఫలితం తప్పకుండా  వస్తుంది అని నిరూపించింది మా 'కోబలి'. మా దర్శకుడు రేవంత్ నమ్మకం కూడా నిజమైంది. నిర్మాతలు జ్యోతి, రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఈ కథని ఎంతో నమ్మారు. వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.  
 
రాకీ సింగ్ మాట్లాడుతూ.. ఇందులో ఉన్న నటీనటులను బట్టి అమ్ముడయ్యే కంటెంట్ కాదిది. అయినప్పటికీ ప్రేక్షకులు ఆదరించారు. కంటెంట్ బాగుంటే మేము ఎప్పుడూ ఆదరించడానికి సిద్ధమని వాళ్ళు నిరూపించారు. చిన్న పాత్ర అయినా చేయడానికి ముందుకు వచ్చిన వెంకట్ గారికి థాంక్స్. కానీ సీజన్ 2 లో ఆయన పాత్ర ఎక్కువగా ఉంటుంది. అసలైన కథ అక్కడ మొదలవుతుంది. ఇది జస్ట్ ట్రైలరే. నాకు ఇలాంటి హిట్ సిరీస్లో భాగమయ్యే అవకాశం ఇచ్చిన జ్యోతికి, రాజశేఖర్ రెడ్డికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.  
 
నిర్మాత జ్యోతి మాట్లాడుతూ.. "మీడియా వారందరికీ నమస్కారం. 'కోబలి' కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా తోటి నిర్మాతలు రాజశేఖర్ రెడ్డి, తిరుపతి శ్రీనివాసరావు గారికి, నటీనటులు అందరికీ స్పెషల్ థాంక్స్. దీనిని యాక్సెప్ట్ చేసిన హాట్ స్టార్ వారికి, ఆదరించిన ప్రేక్షకులకి కూడా థాంక్స్ చెప్పుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.   
 
సీనియర్ హీరో వెంకట్ మాట్లాడుతూ.. 7 భాషల్లోనూ ఇది మంచి విజయాన్ని అందుకుంది. రేవంత్ నాతో కూడా ఒక సినిమా చెయ్యి. అంతకు మించి నీ హార్డ్ వర్క్ గురించి పొగడలేను. స్టార్లు ఉంటేనే కంటెంట్ ని ప్రేక్షకులు ఆదరిస్తారు అనేది పాత మాట. ఇప్పుడు కాలం మారింది.కంటెంట్ బాగుంటే కొత్త పాత తేడా లేదు అని ప్రేక్షకులు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. నిర్మాత జ్యోతి, రాజశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని నమ్మినందుకు పెద్ద థాంక్స్" అంటూ చెప్పుకొచ్చారు. 
 
నిర్మాత రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. " 'కోబలి' మేము ఊహించిన దానికంటే పెద్ద సక్సెస్ అయ్యింది. నార్త్ లో ఈ సిరీస్ కి మేము ఊహించని గొప్ప  ఆదరణ లభిస్తుంది. ఇలానే మంచి కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తాము అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ.. నా తోటి నిర్మాత జ్యోతి అలాగే దీనికోసం పనిచేసిన వారందరికీ థాంక్స్ చెప్పుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.  
 
నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. "గతంలో 'తికమకతాండ' సినిమా తీశాను. ఇప్పుడు 'కోబలి' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాను. అన్ని రాష్ట్రాల్లోనూ ఇది సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. పార్ట్ 2 కూడా దీనికి మించి ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చారు.   
 
 దర్శకుడు రేవంత్ మాట్లాడుతూ.. " 'కోబలి' కి మేము అనుకున్నదానికంటే మంచి రీచ్ వచ్చింది. ముందుగా జ్యోతిగారికి థాంక్స్ చెప్పుకోవాలి.  రవి ప్రకాష్ గారికి కూడా పెద్ద థాంక్స్. రాకీ సింగ్ గారు, ఎస్.ఐ రఘు పాత్ర చేసిన పవన్, రాజు పాత్ర చేసిన మణి, సినిమాటొగ్రాఫర్ రోహిత్ బచ్చు, ఎడిటర్ కిషోర్ మద్దాలి, మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌరా.. అందరికీ థాంక్స్ చెప్పుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు