చిత్ర దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ.. రావణాసురుడికి తన భార్య మండోదరి పై ఉన్న ప్రేమ , రాముడికి సీత పై ఉన్న ప్రేమ , దశరథుడుకు తన కొడుకు మీద నమ్మకం ఇలా ప్రతి ఒక్కరిది అందమైన ప్రేమ. భగవద్గీత, బైబిల్ ఖురాన్ లలో అందమైన, పవిత్ర మైన ప్రేమ ఎలా ఉంటుందో ఈ సినిమాలో కూడా అంతే అందమైన పవిత్రమైన ప్రేమను చూయించడం జరిగింది.లవ్ స్టోరీస్ అంటే అమ్మాయి వెంట అబ్బాయి, లేకపోతె అబ్బాయి వెంట అమ్మాయి పడి లవ్ చేసేలా కాకుండా ఈ సినిమా రెగ్యులర్ స్టోరీలా కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా అద్భుతంగా ఉంటుంది సందీప్ గారు అద్భుత మైన మ్యూజిక్ ఇచ్చారు. ఆగష్టు 19 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
చిత్ర నిర్మాత ముల్లేటి కమలాక్షి మాట్లాడుతూ..ఇక్కడకు వచ్చిన పెద్దలందరికి ధన్యవాదములు. ఈ చిత్రాన్ని ద్వారకా తిరుమలైన చిన్న తిరుపతిలో షూటింగ్ చేయడం జరిగింది. అనుకున్న టైమ్ కు, అనుకున్న బడ్జెట్ లో ఈ సినిమా తీశాము. ఇందులో నటించిన హీరో, హీరోయిన్ లకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుతున్నాను. అలాగే పెద్దలు తనికెళ్ళ భరణి గారికి, జీవా గారికి ఇలా అందరూ బాగా నటించడమే కాకుండా వారంతా సపోర్ట్ చేయడం వలెనే సినిమా బాగా వచ్చింది. టెక్నిషియన్స్ అందరూ డెడికేటెడ్ వర్క్ చేశారు. అందరికీ నా ధన్యవాదములు.. నన్ను నిర్మాతగా పరిచయం చేసిన మా తల్లి తండ్రులు ముల్లేటి నాగేశ్వరావు, ముల్లేటి జానకి గార్లకు ధన్యవాదములు అన్నారు.
హీరోయిన్ అఖిల ఆకర్షణ మాట్లాడుతూ.. ఇప్పుడొచ్చే సినిమాలకు భిన్నంగా ఉన్న "నా వెంటే పడుతున్న చిన్నాడెవడమ్మా " సినిమాను అందరూ ఆదరించాలి అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ.. ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇందులో ఉన్న ఐదు పాటలు కూడా ఐదు వేరేషన్ లో చాలా డిఫరెంట్ ఉంటాయి.ఈ పాటలన్నీ నాకు మంచి పేరు తీసుకువస్తాయి అన్నారు