అంతకుముందు ఆర్.ఆర్.ఆర్.సినిమా కమిట్‌మెంట్‌తో రామ్ చరణ్ డేట్స్ లేవు. కానీ రామ్‌చరణ్ ఆచార్యలో నటించాలి. ఇందుకు తానే రాజమౌళిని కలిసి కాస్త డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకోమని అడిగాను. అందుకు ఆయన సహృదయంతో సహకరించారు. ఇందుకు కారణం కూడా వుంది. నన్ను, చరణ్‌ను వెండితెరపై చూడాలనేది తల్లికోరిక బలంగా వుండడంతో అది సాధ్యపడిందని.. ఇంటర్వ్యూలో కొరటాలతో చిరంజీవి చెప్పారు.
అందుకే ఆచార్య ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా రాజమౌళి హాజరుకానున్నారని తెలుస్తోంది. యూసఫ్ గుడా పోలీస్ గ్రౌండ్‌లో వేడుక ఈనెల 23న ఘనంగా జరగబోతొంది. శ్రేయాస్ ఈవెంట్స్ నిర్వహించే ఈ ఈవెంట్‌లో రాజమౌళి, కొరటాల, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డేతో పాటు పలువురు సినీప్రముఖులు హాజరుకానున్నారు.