Samantha, Shakuntalam, lallu
దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న పిరియాడికల్ మూవీ శాకుంతలం. శాకుంతల పాత్రను స్టార్ నటి సమంత చేయనుంది. దర్శకుడు గుణశేఖర్ చిత్రంలోని ప్రతి అంశాన్ని చారిత్రాత్మకంగా వుండాలని చూస్తున్నాడు. అందుకుగాను భారీ సెట్లను వేస్తున్నారు. మణిశర్మ చేత మంచి బాణీలు చేయించుకుంటున్నారు. మరో ప్రత్యేకత ఏమంటే ఇటువంటి సినిమాకు దుస్తుల కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అందుకే ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీత లుల్లాను తీసుకున్నారు. నీత లుల్లా బాలీవుడ్లో పాపులర్ కాస్ట్యూమ్ డిజైనర్. శ్రీదేవి, ఐశ్వర్యారాయ్ లాంటి ఎంతోమంది పెద్ద సెలబ్రిటీలకు దుస్తులు డిజైన్ చేశారు ఈమె. మొహెంజొదారో, బాలగంధర్వ, దేవదాస్ లాంటి సినిమాలోని కాస్ట్యూమ్ డిజైనింగ్ విభాగంలో జాతీయ అవార్డులను అందుకున్నారు.