అక్కినేని ఇంటి కోడలు సమంత అక్కినేని మరింతగా రెచ్చిపోతోంది. టాలీవుడ్ హీరోయిన్‌గా ఉన్న ఈమె.. పెళ్లికి ముందు ఓ మేరకు అందాలు ఆరబోసింది. కానీ, వివాహమైన తర్వాత మరింతగా రెచ్చిపోతోంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు చూసి నెటిజన్లు ఔరా అంటూ నోరెళ్లబెడుతున్నారు.
నిజానికి సమంత వివాహం తర్వాత సైలెంట్ అవుతుందేమోనని అందరు భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ రెచ్చిపోతుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఓటీటీలే కాకుండా హాట్ హాట్‌గా ఫొటో షూట్ చేస్తూ తన అభిమానులకి మస్త్ మజాని అందిస్తుంది. ఈ మధ్య హాట్ ఫొటోస్‌తో హీట్ పెంచుతున్న సమంత తాజాగా మరో హాట్ ఫొటో షేర్ చేసింది.
బ్లాక్ కలర్ టాప్, గోల్డ్ కలర్ ప్యాంట్ ధరించి మత్తెక్కించే కళ్ళతో చూస్తున్న సమంత ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫొటో తక్కువ సమయంలోనే 16 లక్షల లైకులను దక్కించుకుంది. ఇక తన ఇన్‌స్టాగ్రామ్‌లో వర్కవుట్‌కు సంబంధించి కూడా ఓ వీడియో షేర్ చేసింది.