అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకున్నాము కానీ కుదరలేదు. చివరికి నా స్నేహితుడు కుమారుడు క్రాంతి హీరోగా ముగ్గురు పాట్నర్స్ కలిసి మా అమ్మాయి హీరోయిన్‌గా సినిమాను నిర్మించారు. ఒక టీమ్ వర్క్ గా కథ రాసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
సీనియర్ రైటర్ ఘటికాచలం గారు ఈ సినిమాకు బాగా హెల్ప్ చేశారు. అమ్మాయి, అబ్బాయి ప్రతిభ చూశాక నిర్మాతలు ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా సినిమాను తీశారు, పాటలన్ని అద్భుతంగా వచ్చాయి. లొకేషన్లో మాకు సహకరిస్తున్న కమల్ గారు అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పై మంచి అనుభవం కిలిగిన గౌతమ్ రెడ్డి, కెమెరామెన్ శివకుమార్ రెడ్డి ఈ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేశారు, అతను స్ట్రీట్ చిల్డ్రన్‌ను చదివిస్తున్నాడు, చాలా గొప్ప విషయం ఇది.