హాస్య బ్రహ్మ, కామెడీ కింగ్ బ్రహ్మానందంకు అవకాశాలు ఏమీ రాకపోయినా.. రియల్ లైఫ్‌లో శ్రీమంతుడుగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇప్పట్లో అవకాశాలు రాకపోయినా.. బాగా వెలిగిన రోజుల్లో సంపాదించుకున్న ధనాన్ని జాగ్రత్తగా దాచేసుకున్నాడు. దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకున్నాడు.
సోషల్ లైఫ్‌లో మాత్రం సాదాసీదాగా కనిపిస్తూ పాత, కొత్త స్నేహితులతో కలుపుగోలుగా వుంటున్న బ్రహ్మానందం నాలుగు రూకలు వెనకేసుకోవడంలో మాత్రం గట్టివాడేనని హాస్యబ్రహ్మకు పేరుంది. ఈ నేపథ్యంలో రెండు దశాబ్ధాల పాటు హాస్య లోకాన్ని ఏలిన బ్రహ్మీ ఆస్తుల విలువ రూ.320 కోట్లకు పైగా వుంటుందని టాక్.