విశ్వం ఇంకా చూడని వాళ్ళు తప్పకుండ చూడండి : హీరో గోపీచంద్

డీవీ

శుక్రవారం, 11 అక్టోబరు 2024 (19:43 IST)
Gopichand, Srinu Vaitla, Venu Donepudi, Kavya Copper
గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల దసరా ఎంటర్ టైనర్  'విశ్వం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌ పై నిర్మాత టిజి విశ్వప్రసాద్ హైబడ్జెట్ తో నిర్మించారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పించారు. దసరా కానుకగా శుక్రవారం (అక్టోబర్ 11) వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో ఘన విజయాన్ని అందుకుంది. 
 
ఈ సందర్భంగా  గోపీచంద్ మాట్లాడుతూ,  'విశ్వం'మూవీని మేము ఏదైతే నమ్మమో ఈరోజు ఆడియన్స్ మాకు అంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు. కామెడీ, మదర్ ఎమోషన్ ,ఫాదర్ ఎమోషన్, యాక్షన్ సీక్వెన్స్.. ప్రతి ఎలిమెంట్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫాన్స్ ఫోన్ చేసి ఎక్స్ట్రార్డినరీ, చాలా బాగుందని చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్యూ సో మచ్. ఇంకా చూడని వాళ్ళు తప్పకుండ చూడండి. ఇది కంప్లీట్ ఫ్యామిలీ మూవీ  అన్నారు
 
డైరెక్టర్ శ్రీనువైట్ల మాట్లాడుతూ, నిన్న నైట్ షోస్ లండన్ లో పడ్డాయి. ఆ టైం నుంచి నాకు వరుసగా కాల్స్ మెసేజెస్ వస్తున్నాయి. చూసిన ఆడియన్స్ చాలా ఎక్సైటింగ్ గా ఫీలవుతున్నారు.  సినిమాని విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఈ రెస్పాన్స్ చాలా ఓవర్ వెల్మింగ్ గా ఉంది.  మార్నింగ్ నుంచి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ , రిసెప్షన్ ఆనందంగా అనిపించింది. కథని, కామెడీని, అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. కామెడీని విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నార. నా సినిమాల్లో ఎప్పుడూ జరగనిది ఈ సినిమాలో ఎమోషన్, సెంటిమెంట్ ని ఎక్కువగా రిసీవ్ చేసుకోవడం నాకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. అలాగే యాక్షన్, సాంగ్స్, సెంటిమెంట్ అన్ని చాలా బాగున్నాయి అంటున్నారు.  
 
ఆడియన్స్ థియేటర్స్ లో ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ అన్ని చోట్ల నుంచి చెప్తున్నా కలెక్షన్స్ గురించి విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. చాలా పాజిటివ్ గా ఉంది. మేము అనుకున్న ఎపిసోడ్స్ అన్ని చాలా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. అలాగే ట్రైన్ ఎపిసోడ్ బిగ్ టైం వర్క్ అవుట్ అయ్యింది. పృథ్వి నరేష్ గారి ట్రాక్ వర్కౌట్ అవుతుంది అనుకున్నాం. అలానే వర్క్ అవుట్ అయ్యింది.  హీరో చేసిన పర్ఫార్మెన్స్. యాక్షన్, సాంగ్స్ అన్నిటికీ మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్ని ఎలెమెంట్స్ కి ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఒక్క సెకండ్ కూడా సినిమా బోర్ కొట్టలేదని చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది. యూనిట్ అంతా చాలా సంతోషంగా ఉన్నాము. ఈ విశ్వం ఇంకా పెద్ద స్థాయికి వెళ్తుందని గట్టిగా నమ్ముతున్నాను. ఇంత మంచి సక్సెస్ చేసిన ఆడియన్స్ కి థాంక్యూ వెరీ మచ్. మా టీంకి పేరుపేరునా ధన్యవాదాలు. ప్రొడ్యూసర్స్ వేణు గారు విశ్వ ప్రసాద్ గారు ఇచ్చిన సపోర్ట్ తో ఈ సినిమా ఇంత గ్రాండ్ గా తీయగలిగాను . ప్రేక్షకులు ఇంత బాగా రిసీవ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంద. పండక్కి ఇంత పెద్ద సినిమా అయినందుకు చాలా ఆనందంగా ఉంది' అన్నారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు