అనుకున్నట్లే విజయ్ దేవరకొండ సినిమా హీరో కష్టాల్లో పడింది. అయితే దీనికి కారణం టాలీవుడ్‌లోని మెగా అభిమానులు కాదండోయ్. తమిళ సినీ పరిశ్రమలోని సినిమాలే. వివరాలలోకి వెళ్తే... విజయ్ దేవరకొండ కథానాయకుడుగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ‘హీరో’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతోంది. ఆనంద్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ నిర్మించబోతున్నారు.