నటుడు శివాజీ రాజాకు గుండెపోటు.. స్టెంట్ వేయనున్న వైద్యులు!

బుధవారం, 6 మే 2020 (09:57 IST)
టాలీవుడ్ నటు శివాజీ రాజాకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆ వెంటనే ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడింది. అయితే, ప్రస్తుత ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్నారు. 
 
అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన తనయుడు విజయ్ రాజా, తన తండ్రికి, వైద్యులు స్టెంట్ వేయాలని నిర్ణయించారని తెలిపారు. ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించారని చెప్పారు. 
 
ప్రస్తుతం బంజారా హిల్స్‌లోని స్టార్ ఆస్పత్రిలో శివాజీ రాజా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కాగా, శివాజీరాజాకు గుండెపోటు వచ్చి, ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఫోన్లు చేసి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకుని, తిరిగి ఇంటికి రావాలని అభిలషించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు