తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల యుద్ధం వేడిపుట్టించింది. తెలంగాణలో తెరాస బలం తప్ప ప్రతిపక్షం నామా మాత్రంగా ఉండటంతో వార్ వన్‌సైడ్‌గా మారనుంది. తెరాస కోరుకున్నట్లు 16 సీట్లు గెలుచుకుంటే అంతకు మించిన సంతోషం వారికి ఉండదు. ఒకటి రెండు సీట్లు తగ్గినా వారికి అంత విచారం ఏమీ ఉండదు. అయితే ఆంధ్రలో మాత్రం వాతావరణం విభిన్నంగా ఉంది. వైకాపా, టీడీపీ మధ్య ఎన్నికల హోరు రసవత్తరంగా సాగుతుండగా, ఇందులో జనసేన కూడా చేరడంతో పోటీ ఆసక్తిగా మారింది. పార్టీలు సినీ స్టార్‌లను ప్రచారంలో వాడే ప్రయత్నాలు చేసినా కొందరు తప్పించి ఎవరూ పాలుపంచుకోలేదు.
తెలంగాణ ఎన్నికలలో తన సోదరి పోటీ చేసినా ప్రచారానికి నో అంటే నో అని చెప్పేశాడు. 2009 ఎన్నికల తర్వాత తన తండ్రికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో గుర్రుగా ఉన్న ఎన్టీఆర్‌తో తండ్రి మరణం తర్వాత చంద్రబాబు రాజీ కుదుర్చుకోవాలనుకున్నాడు. అయితే ఎన్టీఆర్ మాత్రం లొంగలేదు. తాజాగా జరగబోయే ఎన్నికల కోసం ప్రచారానికి తారక్‌ని రమ్మన్నా రాలేదు. ఎన్నికల జోరును ప్రేక్షకుడిగా చూస్తూ ఉండటానికి నిర్ణయించుకుని కూల్‌గా ఉండిపోయాడు.