తెలుగు చిత్రపరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులోభాగంగా, ఇప్పటికే అనేక మంది టాలీవుడ్ సెలెబ్రిటీలను విచారిస్తూ వస్తున్నారు. ఆ కోవలో బుధవారం హీరో తరుణ్ ఈడీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు.
అలాగే, బ్యాంక్ స్టేట్‌మెంట్లతో విచారణకు హాజరుకావాలని తరుణ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్‌పై కూడా అధికారులు ప్రశ్నించనున్నారు. 'ఎఫ్ లాంజ్ పబ్' వ్యవహారాలు, నవదీప్ పార్టీలపై ఆరా తీసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాగా గతంలో డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ విచారణకు హాజరైన తరుణ్.. విచారణలో భాగంగా తరుణ్ నుంచి అధికారులు నమూనాలు సేకరించి ఎఫ్ఎస్ఎల్‌కు పంపారు. అయితే ఆ నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇచ్చింది. దీంతో తరుణ్, పూరీ జగన్నాథ్‌లకు ఎక్సైజ్ శాఖ క్లీన్ చీట్ ఇచ్చింది.