సక్సెస్ ఈజ్ నాట్ జస్టినేషన్... ఇట్స్ ఏ జర్నీ : హీరో నాని

ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (11:42 IST)
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 చంద్రుడికి 2.1 కిలో మీట‌ర్ల దూరంలో ఆగిపోయింది. ఈ మిషన్ మూన్ విఫలమైనప్పటికీ తీరుపై విష‌యం విదిత‌మే. అయితే, మిష‌న్ మూన్ విఫ‌ల‌మైన‌ప్ప‌టికి వారి ప‌నితీరుని దేశ‌మంతా ప్ర‌శంసిస్తుంది. మీకు ఎల్ల‌ప్పుడు మా అండ ఉంటుదని ధైర్యాన్ని అందిస్తున్నారు. రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు కూడా శాస్త్ర‌వేత్త‌ల‌కి బాస‌ట‌గా నిలుస్తున్నారు. 
 
ఇలాంటి వారిలో హీరో నాని కూడా ఒకరు. మ‌హేష్ ‘మహర్షి’ సినిమాలోని ఫేమస్‌ డైలాగ్‌ ‘సక్సెస్‌ ఈజ్‌ నాట్‌ జస్టినేషన్‌, ఇట్స్‌ ఏ జర్నీ’ జతచేస్తూ మీరు చేసిన ఈ చారిత్రక ప్రయత్నానికి కృతజ్ఞతలు అంటూ, సెల్యూట్‌ రియల్‌ హీరోస్‌, మేమంతా ఎప్పుడూ మీతోనే ఉంటామని ట్విట్టర్‌ ద్వారా తెలిపాడు. 
 
మీ విజయానికి ఇది ఆరంభం మాత్రమేననీ, మీరు ఇంకా చాలా సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఇక నాని ఇస్రో ఛైర్మ‌న్ శివ‌న్‌ని మోడీ ఓదారుస్తున్న వీడియోని జ‌త చేసి మిమ్మ‌ల్ని చూసి గ‌ర్విస్తున్నాము ఇస్రో అంటూ ట్వీట్ చేశారు. ఇస్రో చంద్ర‌యాన్ 2 విష‌యంలో చేసిన త‌ప్పుల‌ని స‌వ‌రించుకొని అతి త్వ‌ర‌లో చంద్ర‌యాన్ 3 మిష‌న్ మొద‌లు పెట్ట‌నున్న‌ట్టు తెలుస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు