ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో నెలకొల్పిన కియా కార్ల తయారీ కంపెనీ నుంచి తొలి కారు బయటకు వచ్చింది. ఈ కారును ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆయనే స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేశారు. దీనిపై అనేక మంది ట్వీట్ల ద్వారా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారిలో హీరో రామ్ పోతినేని ఒకరు. రామ్ చేసిన ఒక్క ట్వీట్‌పై అనేక మంది నెటిజన్లు ఆయన్ను అభినందించారు.
తాను చేసిన ట్వీట్‌కు కొందరు నెటిజన్లు చేసిన కామెంట్స్‌పై రామ్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'నా ఇల్లు సక్కపెట్టేడోడు ఎవరైతే నాకేంటి అన్నాయ్... నువ్వుచెయ్.. నీకు ఇస్తా ఓ ట్వీటు. ఆంధ్రా నాదే.. తెలంగాణా నాదే. ఇదే మీట మీదుంటా. ఇక్కడ కులం లేదు. మతం లేదు.. ప్రాంతం లేదు. డిస్కషన్ అస్సలే లేద్' అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.