ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సురక్షిత నగరాల జాబితా తాజాగా వెల్లడైంది. ఇందులో భాగ్యనగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరానికి మాత్రం చోటు దక్కలేదు. ఈ జాబితాను నంబియో సేఫ్టీ ఇండెక్స్ తాజాగా వెల్లడించింది. సురక్షిత దేశాల జాబితాలో ఇండియాకు 67వ స్థానం లభించింది. భారత్‌లో మాత్రం ద అత్యంత సురక్షిత నగరంగా మంగుళూరు తొలిస్థానంలో నిలిచింది.
దేశ రాజధాని ఢిల్లీ మాత్రం అట్టడుగు స్థానంలో నిలిచింది. ముఖ్యంగా, గుజరాత్ రాష్ట్రంలోని వడోదర, అహ్మదాబాద్, సూరత్ నగరాలు కూడా జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి. టాప్ 10 జాబితాలో హైదరాబాద్ నగరానికి చోటు దక్కకపోవడం గమనార్హం. ప్రపంచలోని అత్యంత సురక్షితమైన దేశాల జాబితాల ఇండియా 67వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్‌లో ఇండియా 55.8 స్కోరును సాధించింది.
నంబియో సేఫ్టీ ఇండెక్స్ ప్రకారం దేశంలోని టాప్ 10 నగరాల జాబితాలో మొదటి స్థానంలో మంగుళూరు, రెండో స్థానంలో వడోదర, మూడో స్ధానంలో అహ్మదాబాద్, నాలుగో స్థానలో సూరత్, ఐదో స్థానంలో జైపూర్, ఆరో స్థానంలో నవీ ముంబై, ఏడో స్థానంలో తిరువనంతపురం, ఎనిమిదో స్థానంలో చెన్నై, తొమ్మిదో స్థానంలో పూణె, పదో స్థానంలో చండీగఢ్ నగరాలు నిలిచాయి.