వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజుకి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దీనితో ఆయన హోం క్వారెంటైన్లోకి వెళ్లిపోయారు. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ రిలీజై విజయవంతంగా ముందుకు దూసుకువెళుతోంది. ఈ నేపధ్యంలో నిర్మాత దిల్ రాజు యూనిట్ సభ్యులతో కలసి ప్రమోషన్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్నారు. ప్రేక్షకులతో కలిసి తన ఆనందాన్ని పంచుకున్నారు. థియేటర్లలో ఆడియెన్సుతో కలిసి షోలు కూడా చూశారు.