గ్యాంగ్‌స్టర్ నయీమ్ మరణించడంతో ప్రాబ్లమ్ లేదనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఆయన అనుచరులు ఇంకా బతికే వున్నారని నిర్మాత నట్టి కుమార్ ఇటీవల ప్రెస్ మీట్‌లో చెప్పారు. నట్టి కుమార్ కామెంట్స్‌తో సినీ ఇండస్ట్రీలో చాలామంది జడుసుకుంటున్నారు. నయీమ్ ఖాతాలో ఇప్పటికే చాలామంది సినీ పెద్దలుండగా, ఆయన మరణానికి అనంతరం అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అయితే అతడి అనుచరులు మాత్రం నయీమ్‌ను అనుసరించాలని.. అతని వృత్తినే చేతబట్టాలనుకుంటున్నారట. అదే కనుక జరిగితే మాత్రం మళ్లీ నయీమ్ చేపట్టిన దుశ్చర్యలు ఉత్పన్నం కావడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ నిర్మాతలు సి. కల్యాణ్, బండ్ల గణేష్, సచిన్ జోషీ, అశోక్ కుమారులతో నయీమ్‌కు ప్రత్యక్ష సంబంధాలున్నట్లు తెలిసింది. వీరందరినీ నయీమ్ ఇబ్బంది పెట్టాడు. దీని గురించి అప్పటి ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుతో చెప్పినా.. ఏమాత్రం పట్టంచుకోలేదని నట్టి కుమార్ ప్రెస్ మీట్‌లో చెప్పారు.