కెసిఆర్ నివాళి, రేపు షూటింగ్స్ బంద్

మంగళవారం, 15 నవంబరు 2022 (16:06 IST)
KCR-krishaku nivali
కృష్ణ భౌతిక కాయం ఈరోజు తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్. 'సందర్శించి నివాళులు అర్పించారు. మహేష్ బాబుతో కొద్దిసేపు గడిపారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా నివాళి అర్పించారు. 
 
ఇందు మూలంగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తెలియజేయునది  ఏమనగా.. అంటూ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ రేపు షూటింగ్స్ బంద్ అని ప్రకటించింది. ప్రముఖనటుడు, నిర్మాత, దర్శకుడు, స్టూడియో అధినేత, సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ రోజు ఉదయం హైదరాబాదులో స్వర్గస్తులైనారు. కాబట్టి సూపర్ స్టార్ కృష్ణ గారికి గౌరవ సూచనగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ తెలుగు సినిమా పరిశ్రమ రేపు (బుధవారం 16-11-2022) మూసివేయడం జరుగుతుంది అని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గౌరవ కార్యదర్శి (టి. ప్రసన్న కుమార్), గౌరవ కార్యదర్శి (మోహన్ వడ్లపట్ల) తెలియజేశారు. 
 
ఇదిలా ఉండగా, కృష్ణ భౌతిక కాయం ఈరోజు సాయంత్రం 5గంటలకు గచ్చి బౌలి స్టేడియం లో ఉంచుతున్నారు. బుధవారం నాడు అంత్య క్రియలు మహా ప్రస్థానం లో తెలంగాణ ప్రభుత్యం అధికారికముగా జరపనుంది.
 
ఉదయం ఆటలు రద్దు
 
సూపర్ స్టార్ కృష్ణగారి అకాల మృతికి సంతాపంగా ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉదయం ఆటలు రద్దు చేయడమైనదాని పశ్చిమగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఎగ్జిబ్యూటర్స్ తెలియజేసింది. హైద్రాబాద్ లోనూ ఆటలు రద్దు అయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు