త్రిష పెళ్ళి చేసుకోబోతున్నదన్న విషయం పాఠకులకు విదితమే. కాగా, ఈ రోజు త్రిష పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సమంత అక్కినేని శుభాకాంక్షలు తెలుపుతూ, త్రిష హావభావాలులాగా తాను చూస్తున్న ఫోజ్‌తో విషెస్ తెలిపింది. ఇక రామ్‌చరణ్ అయితే తన పేజ్‌లో త్రిష గత కాలంఫొటో పెట్టి బ్యూటిఫుల్ నటికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్‌చేశాడు. ఇదిలా వుండగా, మరికొందరు త్రిషకు పుట్టినరోజుతోపాటు పెండ్లికి కూడా పనిలో పనిగా చెప్పేశారు. దీంతో త్రిష పెండ్లి ఖరారు అని తేలిపోయింది.