ఆ హీరోతో సుస్మిత పెళ్లిన చిరంజీవి గ్రాండ్‌గా చేయాలని భావించారు.. అతనే పెళ్లిని ఆపేశాడట...

శనివారం, 8 జులై 2017 (17:40 IST)
ఉదయ్ కిరణ్... టాలీవుడ్ యువ హీరో. ఈ హీరో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, టాలీవుడ్‌లోకి ప్రవేశించిన కొద్ది రోజుల్లోనే లవర్ బాయ్‌గా ప్రశంసలు అందుకుని ఎన్నో మంచి చిత్రాలు చేశాడు. మ‌ధ్య‌లో కాస్త గాడి తప్పి.. చిత్ర పరిశ్రమకే కాదు ఏకంగా ఈలోకాన్ని వీడి వెళ్లిపోయాడు. 
 
అయితే, ఉదయ్ చ‌నిపోవ‌డానికి ముఖ్య కార‌ణం చిరు కుమార్తె సుస్మిత‌తో వివాహం ఆగిపోవ‌డమే అని ప‌లు ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎన్నో రూమ‌ర్స్ వినిపించాయి. చివ‌రికి అస‌లు ఉద‌య్ కిర‌ణ్ ఆత్మహ‌త్య ఎందుకు చేసుకున్నాడు అనే విష‌యాల‌పై ఆయన సోద‌రి శ్రీదేవి కొన్ని విష‌యాలు వెల్ల‌డించారు. 
 
ఉద‌య్ మ‌ర‌ణం వెనుక ముఖ్య కార‌ణం చిరంజీవి ఉన్నాడ‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను ఆమె కొట్టి పారేశారు. తొలుత ఓ యువ‌తిని ప్రేమించి మోస‌పోయాక కొన్ని నెల‌ల పాటు బ‌య‌ట‌కు రాని ఉద‌య్ కిర‌ణ్‌ని ప్రోత్స‌హించి, కెరీర్‌పై పూర్తి దృష్టిపెట్టేలా చేసింది చిరంజీవే అని ఉద‌య్ కిరణ్ అక్క చెప్పుకొచ్చింది. 
 
అలాగే, చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే ఉదయ్‌కు చాలా ఇష్టమని... ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఉదయ్‌కు చిరంజీవి చాలా సహకారం అందించారని తెలిపారు. తన కుమార్తెను కూడా ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నారని... గ్రాండ్‌గా నిశ్చితార్థం చేశారని చెప్పారు.
 
అయితే, నిశ్చితార్థం తర్వాత ఒకరి గురించి మరొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేశారని... ఇద్దరి ఆలోచనలు కలవడం లేదనే అభిప్రాయానికి వచ్చారని తెలిపారు. పెళ్లి రద్దు చేసుకుందామనే నిర్ణయాన్ని ఉదయ్ కిరణే తీసుకున్నాడని చెప్పారు. ఉదయ్‌తో కలసి ఒకసారి చిరంజీవి ఇంటికి వెళ్లానని... ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం అద్భుతమన్నారు. అందువల్ల ఉదయ్ పెళ్లి రద్దుకు, ఆత్మహత్యకు చిరంజీవి కారణం కాదని ఆమె స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి