'గౌతమిపుత్ర శాతకర్ణి' విశ్వరూపం చూసి ఆశ్చర్యపోయా.. మంత్రి వెంకయ్య

శనివారం, 14 జనవరి 2017 (15:53 IST)
నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు శనివారం వీక్షించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో వెంకయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ చిత్ర ప్రదర్శనను తిలకించారు. ఆ తర్వాత వెంకయ్య స్పందిస్తూ.. నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచేలా శాలివాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను అందించిన క్రిష్‌కు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. 
 
అలాగే, ఈ చిత్ర హీరో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌, మాటల రచయిత సాయిమాధవ్‌తో పాటు సాంకేతిక నిపుణులను ఆయన అభినందించారు. అతి తక్కువ కాలంలోనే ఇంతటి భారీ చిత్రాన్ని తెరకెక్కించడం తననెంతో ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. సినిమాలు చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపని తనకు గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్ర ఆధారంగా తీసిన సినిమా ఆకట్టుకుందని, తప్పకుండా మరింతగా ప్రేక్షకాదరణ పొందుతుందన్నారు. 

వెబ్దునియా పై చదవండి