'ఉప్పెన'కు సునామీ కలెక్షన్లు, మొదటి రోజు ఎంతో తెలుసా?

శనివారం, 13 ఫిబ్రవరి 2021 (16:01 IST)
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన కలెక్షన్ల సునామీ కురిపిస్తోంది. ఏడాది పాటుగా ప్రేక్షకుల కోసం ఎదురుచూసిన ఉప్పెన ఈ శుక్రవారం 12వ తేదీన విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. విడుదలైన మొదటి రోజే రూ. 10. 42 కోట్లు వసూళ్లు చేసి రికార్డ్ సృష్టించింది.
 
ఈ చిత్రంలో మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. అతడికి జోడీగా కృతిశెట్టి నటించగా ఆమె తండ్రిగా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించాడు. చిత్రం స్క్రీన్ ప్లే, ఆకట్టుకునే సన్నివేశాలతో వుండటంతో ప్రేక్షులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు.
 
ఇక కలెక్షన్ల విషయానికి వస్తే... నైజాం ఏరియా, ఏపీ మొత్తం కలిపి రూ. 9.3 కోట్లు వసూలు చేయగా ‌కర్ణాట‌క‌లో రూ.52 ల‌క్ష‌లు వసూలయ్యాయి. త‌మిళ‌నాడు రూ.16 ల‌క్ష‌లు వసూలు కాగా ఓవ‌ర్ సీస్లో రూ.34 ల‌క్ష‌లు వసూలు చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు